పవన్ సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్..!

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ నిజానికి గతేడాదే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల విడుదల కాలేదు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నారు. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారో..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నాడని ఇన్సైడ్ టాక్.

అదేంటి అల్లు అర్జున్ కు.. ‘వకీల్ సాబ్’ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. నిజానికి వకీల్ సాబ్మొ దలవ్వడానికి ముందే వేణు శ్రీరామ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని చెయ్యాలని ప్లాన్ చేసాడు నిర్మాత దిల్ రాజు. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. కానీ ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల హోల్డ్ లో పడిపోయింది. కానీ దిల్ రాజుకి మాత్రం ఈ ప్రాజెక్టు చెయ్యాలనే ఆశ బలంగా ఉంది. అందుకే ఖాళీ దొరికానప్పుడల్లా అల్లు అర్జున్ తో చర్చలు జరుపుతూనే ఉన్నాడు.

అయితే ఇటీవల ‘వకీల్ సాబ్’ పూర్తయ్యాక చూద్దాంలే అని అల్లు అరవింద్ గారు దిల్ రాజుతో అన్నారట. అంటే ‘వకీల్ సాబ్’ కనుక హిట్ అయితే వెంటనే ‘ఐకాన్’ చెయ్యడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చేస్తున్నాడు. సెప్టెంబర్ నుండీ కొరటాల మూవీని కూడా మొదలుపెడతాడని సమాచారం. మరి ‘ఐకాన్’ గురించి నిజంగానే అతను పట్టించుకుంటాడా అంటే.. అది నిజంగా ‘వకీల్ సాబ్’ రిజల్ట్ ను బట్టే ఆధారపడి ఉంటుంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus