Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అలాంటి వ్యాధితో బాధపడుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు..

స్నేహ రెడ్డి తన పిల్లలతో కలిసి అల్లు అర్జున్ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో అసలు స్నేహారెడ్డికి ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి సమస్యలు వారిని వేధిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే స్నేహ రెడ్డికి ఓసిడి అనే ఒక సమస్య ఉందని తెలుస్తోంది.

ఈమె (Allu Sneha Reddy) ఉన్న ప్రాంతంలో ఎక్కడ ఏమాత్రం నీటిగా లేకపోయినా అసలు సహించరట దీంతో ఎప్పుడూ కూడా తన చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారట. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం రెండు నెలలపాటు బయట షూటింగ్స్ లో పాల్గొంటూ దుమ్ము దూలికి కష్టపడిన విషయం మనకు తెలిసిందే. అయితే తన భర్త అలా దుమ్ము దూలిలో ఉండడంతో దాదాపు వారం రోజులపాటు తనని దూరం పెట్టారనీ కూడా వార్తలు వస్తున్నాయి.

తను మాత్రమే కాకుండా తన పిల్లల విషయంలో కూడా ఈమె చాలా క్లీనెస్ మైంటైన్ చేస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇలా ఓసిడి సమస్యతో బాధపడుతున్నటువంటి స్నేహ రెడ్డి తరచూ తన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని భావించడమే కాకుండా స్వచ్ఛమైన గాలి వెలుతురు ఉండాలన్న ఉద్దేశంతో తన ఇంటి చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన మొక్కలను పెంచుతూ ఉంటారట. అయితే స్నేహ రెడ్డి బాధపడుతున్నటువంటి ఈ వ్యాధికి మరే ట్రీట్మెంట్ లేదని, చుట్టూ ఉన్నవారు వారిని అర్థం చేసుకొని పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడమే ఈ వ్యాధికి చికిత్స అని చెప్పాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus