టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ చదవండి అని అడిగితే ఆ లిస్ట్ లో మన స్టైలిష్ స్టార్ బన్నీ పేరు తప్పక ఉంటుంది. తన కరియర్ ఆరంభంలో మెగా అభిమానులపై ఆధారపడిన బన్నీ కాలక్రమేణా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటుచేసుకున్నాడు. అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో బన్నీ మంచి ఊపు మీద ఉన్నాడు. గత ఏడాది సారైనోడు బ్లాక్ బష్టర్ కొట్టడంతో అదే ఊపుతో, గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ‘డీజె’ దువ్వాడ జగన్నాధం సినిమా చేస్తున్న సంగటు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, అదే క్రమంలో బన్నీ తన తరువాత సినిమా ప్రముఖ కధా రచయిత వక్కంతం వంశీతో చేయనున్నట్లు సమాచారం. అయితే దర్శకత్వం కూడా వంశీనే చెయ్యడం విశేషం. ఇదిలా ఉంటే అసలు విషయం ఏమిటి అంటే, బన్నీ వక్కంతం వంశీ డైరక్షన్ లో చేస్తున్న సినిమా పేరు నా పేరు సూర్య సినిమా అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్.
ఇక ఈ సినిమా ఇంకా మొదలు కాకముందే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఏకంగా బాలీవుడ్ క్రేజీ హీరో అజయ్ దెవగన్ బన్ని సినిమా కోసం జీ స్టూడియోస్ తో కలిసి ఏకంగా 25 కోట్లకు తెలుగు, హింది, మళయాల శాటిలైట్ హక్కులను అడుగుతున్నారట. సినిమా స్టార్ట్ అవకముందే సినిమాపై ఇంత బిజినెస్ జరగడం ఆశ్చర్యకరమే. సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందట. నేషనాలిటీకి సంబంధించిన కథ కాబట్టి అన్ని భాషల్లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అంతేనా మళయాలంలో బన్ని సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే కేవలం తెలుగు హిందిలో కాకుండా మళయాలంలో కూడా జీ వారితో కలిసి అజయ్ దేవగన్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక ఇదే నిజం అయితే ఇప్పటివరకూ సౌత్ ను తన క్రేజ్ తో ఊపేస్తున్న బన్నీ ఇక నార్త్ లో కూడా, తన క్రేజ్ ను మరింత పెంచుకుంటాడు అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.