బాలకృష్ణ (Nandamuri Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే కాంబినేషన్లో ‘సింహా'(Simha) , లెజెండ్ (Legend) ‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టు హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి ‘అఖండ 2’ తో సిద్ధమవుతున్నారు. ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కోవిడ్ టైంలో రిలీజ్ అయ్యి…
Akhanda 2
తక్కువ టికెట్ రేట్లు, 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచినప్పటికీ భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. దీంతో ‘అఖండ 2’ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు. అయితే ‘అఖండ 2’ కథ, కథనాల విషయంలో ప్రేక్షకులకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా పాప చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది.
మొదటి భాగం క్లైమాక్స్ లో మురళీకృష్ణ(చిన బాలయ్య) కూతురికి ఏదైనా సమస్య వస్తే తానొస్తానని రుద్ర సికందర్ ఘోరా(పెద బాలయ్య) మాటిస్తాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉన్న పాప సెకండ్ పార్ట్లో కనిపించదట. కథ ప్రకారం ఆ పాప పెద్దదై, ఆమె జీవితానికి మరో పెద్ద సమస్య వచ్చి పడటం.., విలన్ వల్ల ప్రాణ హాని ఉందని తెలిసి రుద్ర సికందర్ ఘోర ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది.
ఇక ఆ పాప పాత్రలో లయ (Laya) కూతురు శ్లోక నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పాప పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. గతంలో శ్లోకా.. రవితేజ (Ravi Teja) నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony) సినిమాలో చిన్నప్పటి ఇలియానా (Ileana) పాత్రలో నటించింది.ఆ సినిమా ప్లాప్ అవడంతో ఈమెకు ఛాన్సులు రాలేదు. మరి ‘అఖండ 2’ ఈమెకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.