రీమేక్ సినిమాకి సీక్వెల్.. వర్కౌట్ అవ్వుద్దా?

ఓ సూపర్ హిట్ సినిమాని మరో భాషలోకి రీమేక్ చెయ్యడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే అలా రీమేక్ చేసి హిట్ అయిన సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ నిర్వహించడానికి కూడా ప్లాన్స్ జరుగుతుండడం గమనార్హం. గతేడాది విడుదలైన ‘రాట్ససన్'(తమిళ్) రీమేక్ అయిన ‘రాక్షసుడు’ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి తమిళంలో ఈ చిత్రానికి ఇంకా సీక్వెల్ ప్లాన్ చెయ్యలేదు.

సరిగ్గా ఇలాగే బన్నీ హిట్ సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా బాలీవుడ్ లో కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ – ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్.. ‘పరుగు’ చిత్రాన్ని టైగర్ ష్రాఫ్ హీరోగా బాలీవుడ్ లో ‘పంతి’ పేరుతో రీమేక్ అయ్యింది. టైగర్ ష్రాఫ్ డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇందుకు టైగర్ ష్రాఫ్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఆ సీక్వెల్ లో బన్నీ కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి బన్నీ ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న?

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus