Pushpa 2: ‘పుష్ప 2’ కి నార్త్ లో ఆ రేంజ్ బిజినెస్ జరగట్లేదా?

అల్లు అర్జున్ కి (Allu Arjun) నార్త్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ కమర్షియల్ లెక్కల ప్రకారం అది ఎంతవరకు ఉంది.? అతని సినిమాల బిజినెస్ పరంగా అక్కడ ఎంత వరకు రికవరీ ప్లాన్ చేయొచ్చు? ఈ విషయాలు అన్నీ అంచనా వేసుకోవాలి. ‘పుష్ప..’ (Pushpa: The Rise) మేకర్స్ ఈ విషయంలో కాస్త అత్యాశకి పోతున్నట్టు వినికిడి. విషయం ఏంటంటే.. ‘పుష్ప’ సినిమా 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ ఏమీ జరగలేదు.

అయినప్పటికీ ‘పుష్ప’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా నార్త్ లో రూ.13 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అక్కడ భారీ లాభాలను సొంతం చేసుకుంది. కానీ ఔట్ రైట్ గా అక్కడ ఈ సినిమా హక్కుల్ని అమ్మేశారు. కాబట్టి.. ‘పుష్ప’ నిర్మాతలైన మైత్రి వారికి పెద్దగా లాభాలు ఏమీ దక్కలేదు.దీంతో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  తో అక్కడ భారీగా రికవరీ చేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో హిందీ రైట్స్ ను థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఆడియో..

ఇలా అన్నిటికీ కలిపి రూ.300 కోట్ల భారీ రేటు చెబుతున్నారట. కానీ అక్కడి మేకర్స్ అంత రేటు చెల్లించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తెలుస్తుంది. మొత్తంగా రూ.250 కోట్ల వరకు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారట. అది కూడా మంచి రేటే కానీ, ఎందుకో ‘పుష్ప’ మేకర్స్ రిలీజ్ టైం వరకు ఆగితే ఇంకాస్త రేటు పెంచుతారేమో అనే అత్యాశకి పోతున్నట్టు వినికిడి. చూడాలి మరి ఏమవుతుందో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus