Pushpa 2: ఆ భాషలో కూడా బన్నీ మూవీ విడుదల కానుందా.. భలే ప్లాన్ అంటూ?

అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 (Pushpa 2: The Rule)  సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లో సైతం రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆగష్టు 15వ తేదీన బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. బన్నీ ప్లాన్ భలే ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

గతంలో కూడా పలు తెలుగు సినిమాలు బెంగాలీ భాషలో డబ్ అయినా ఇతర భాషల్లో రిలీజ్ అయిన సమయంలోనే బెంగాలీ భాషలో రిలీజ్ కావడం పుష్ప2 సినిమా విషయంలోనే జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప2 సినిమా అలవోకగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఈ సినిమా అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ విషయంలో ఏ మాత్రం సందేహాలు అక్కర్లేదని అనుకున్న తేదీకే ఈ సినిమా విడుదలవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రూల్ సినిమా బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు 450 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప2 సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం అదుర్స్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు కేవలం 100 రోజుల సమయం మాత్రమే ఉండటం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా కోసం సుకుమార్ ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ రేంజ్ ఎన్నో రెట్లు పెరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమాతో రష్మిక తన ఖాతాలో మరో సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్ప ది రూల్ తో బన్నీ బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో రూల్ చేస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus