Allu Bobby: వాళ్లను చూసి భయపడ్డానంటున్న అల్లు బాబీ!

సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు అల్లు బాబీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు బ్రదర్స్ లో ఒకరైన అల్లు బాబీ మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమాకు అల్లు బాబీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. గని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాలో ముచ్చటించిన అల్లు బాబీ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Click Here To Watch NOW

అల్లు స్టూడియో గురించి అల్లు బాబీ మాట్లాడుతూ మొదట నగరానికి దూరంగా స్థలం తీసుకున్నామని అక్కడ ముగ్గురు సోదరుల కొరకు మంచి వీకెండ్ రిసార్ట్ కట్టుకోవాలని అనుకున్నామని వెల్లడించారు. అనంతరం అక్కడ ఆయుర్వేదిక్ రిసార్ట్ కమ్ వెల్ నెస్ సెంటర్ ఉంటే బాగుంటుందని అనిపించిందని అల్లు బాబీ కామెంట్లు చేశారు. ఆ తర్వాత తాము కొనుగోలు చేసిన స్థలం చుట్టూ పెద్దపెద్ద బిల్డింగ్ లు రావడంతో స్టూడియో ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు.

ఆహా ఓటీటీని మొదలుపెట్టడానికి ముందు మార్కెట్ లో ఉన్న పెద్దపెద్ద ప్లేయర్లను చూసి భయపడ్డానని అల్లు బాబీ పేర్కొన్నారు. ఏం చేసినా కిక్ ఉండటంతో పాటు పదిమందికి ఉపయోగపడాలని తన కోరిక అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైవసీకి తాను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని అందుకే నటనకు దూరంగా ఉన్నానని అల్లు బాబీ వెల్లడించారు. తనను సినిమాలలో నటించాలని చాలామంది అడిగారని అల్లు బాబీ పేర్కొన్నారు. మంచి కథ దొరికితే బన్నీతో సినిమా నిర్మించడానికి సిద్ధమేనని బాబీ అన్నారు.

12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని తాను తెరవెనుక ఉండటం వల్ల ఎక్కువగా ఫోకస్ కాలేదని అల్లు బాబీ వెల్లడించారు. గని కథకు వరుణ్ తేజ్ కరెక్ట్ కాబట్టి తీసుకున్నామని అంతే తప్ప వరుణ్ తేజ్ కజిన్ బ్రదర్ అని తీసుకోలేదని అల్లు బాబీ పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus