అల్లు శిరీష్.. ఇండస్ట్రీ మొత్తాన్ని సర్ప్రైజ్ చేశాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈరోజు తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ‘ఈరోజు, మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా, అందరితో ఓ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నైనిక అనే అమ్మాయితో త్వరలో నా నిశ్చితార్థం జరగనుంది. ఈ మధ్యనే మా నాయనమ్మ మరణించారు, ఆమె పోయే ముందు నా పెళ్లి చూడాలని ఉందని పదే పదే చెప్పుకొచ్చేది.
భౌతికంగా ఆమె మా మధ్య లేకపోయినా, ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉంటాయని నమ్ముతున్నాను. మా ఫ్యామిలీస్ కూడా మా ప్రేమను ఆనందంతో యాక్సెప్ట్ చేయడం అనేది కూడా నాకు మరింత ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది”అంటూ తనకు కాబోయే భార్య చేయి పట్టుకుని దిగిన ఫోటోని షేర్ చేసి అసలు విషయం చెప్పుకొచ్చాడు. అయితే తన ఫియాన్సీ ఫోటోని రివీల్ చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో చర్చ మరింత ఎక్కువైంది. శిరీష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. అంటూ చిన్న లీడ్ కోసం అతని ప్రొఫైల్ మొత్తం తిరగేస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. నైనిక కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయట. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో బాగా రాణించారు అని అంటున్నారు. శిరీష్, నైనిక 2 ఏళ్ళ నుండి డేటింగ్లో ఉన్నారట. ఇటీవల ఈ జంట కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకున్నారని తెలుస్తుంది. అయితే శిరీష్ నాయనమ్మ చనిపోయి ఇంకా 2 నెలలు కూడా కాలేదు. హిందూ సంప్రదాయం ప్రకారం.. అబ్బాయి ఇంట్లో కీడు జరిగితే.. ఏడాది వరకు ఎటువంటి శుభకార్యం జరగకూడదు అంటారు. ఆ లెక్కన శిరీష్ వివాహం ఈ ఏడాది ఉంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.