Allu Arjun: ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్ లో పాల్గొనబోతున్న అల్లు అర్జున్!

చాలా రోజుల తర్వాత అల్లు వారసుడు అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా చాలా రోజుల తర్వాత అల్లు శిరీష్ మంచి హిట్ అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో చిత్ర బృందం ఆదివారం

ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.ఇలా సక్సెస్ మీట్ కార్యక్రమం ద్వారా ఈ సినిమాని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయునున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఈ విధంగా ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రాబోతున్నారని తెలియడంతో ఎంతోమంది అల్లు ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా తమ్ముడు సినిమా కోసం అన్నయ్య సపోర్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అభిమానులు వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం జే ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus