సహజంగా ఏ హీరో అయినా తన సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటాడు. ఇక ఆ హీరో అభిమానులు అయితే తమ యాంటీ హీరో సినిమాను మించి ఉండలనో, లేకపోతే అప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న రికార్డును బద్దలు కొట్టాలనో ఆశపడతారు. అయితే ఇప్పుడంటే అందరూ బాహుబలి…బాహుబలి అంటున్నారు కానీ, అప్పట్లో అంతా…మగధీర సినిమా రికార్డ్స్ నే టార్గెట్ చేసేవారు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతాన్ని మన ముందు తెరపై ఆవిష్కరించడం అంటే కాస్త కష్టం అయిన విషయం. ఇక ఇప్పుడున్న దర్శకుల్లో రాజమౌళి.. క్రిష్.. గుణశేఖర్ లాంటి అనుభవమున్న దర్శకులు మాత్రమే ఇలాంటి సినిమాల్ని డీల్ చేయగలరు.
ఇలాంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువుండాలి. శ్రమ కూడా ఎక్కువే పడాలి. కానీ ఒక చిన్న దర్శకుడు, ఒక చిన్న హీరోతో రిస్క్ చేస్తాను అంటున్నాడు…ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే…మల్లిడి వేణు అనే ఓ కొత్త దర్శకుడు.. అల్లు శిరీష్ లాంటి చిన్న హీరోను పెట్టుకుని పెద్ద సాహసమే చేస్తున్నాడు. అతను దాదాపు 800 ఏళ్ల కిందటి నేపథ్యంతో ఓ ప్రేమకథను ప్లాన్ చేశాడట. గత జన్మలో ఒక్కటి కాలేకపోయిన ఇద్దరు ప్రేమికులు.. మళ్లీ జన్మించి తమ ప్రేమను సఫలం చేసుకునే కథ. దాదాపుగా మన మగధీర సినిమాను తలపించేలా అనిపించినా ఈ కధలో రాజులు, రాజ్యాలు లేవట. అసలే ఎంటర్‌టేన్‌మెంట్ లేకపోతే కబాలి లాంటి సినిమాలనే పక్కన పెట్టేసి జెనరేషన్ మనది మరి ఇలాంటి సమయంలో 800ఏళ్ల కధను మన యువ దర్శకుడు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.