Allu Sirish: లావణ్య మంచి హౌస్ వైఫ్ అవుతుంది: అల్లు శిరీష్

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా నార్త్ నుంచి సౌత్ సినిమాలలోకి వచ్చినటువంటి ఈమె త్వరలోనే మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. లావణ్య త్రిపాటి నటుడు వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి పలు సినిమాలలో నటించారు.

ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు ఇప్పటికే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి జూన్ 9వ తేదీ వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వీరి వివాహం జరగబోతోందనీ వరుణ్ తేజ్ తెలియచేశారు ఇంకా తమ పెళ్ళికి తేది ఫిక్స్ కాలేదని ఈయన తెలిపారు.

ఇలా త్వరలోనే మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి గురించి గతంలో అల్లు శిరీష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాటి అల్లు శిరీష్ హీరోగా శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు శిరీష్ (Allu Sirish) లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ ఈమె చాలా మంచి హౌస్ వైఫ్ అవుతుందని తెలిపారు. లావణ్య త్రిపాటికి ఓపిక సహనం చాలా ఎక్కువ అని పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు చాలా మంచిగా చూసుకుంటుందని లావణ్య గురించి అల్లు శిరీష్ చేసినటువంటి ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus