చిరు 150 లో నటిస్తున్నా : సునీల్!
- July 30, 2016 / 11:00 AM ISTByFilmy Focus
గత కొంతకాలంగా చిరంజీవి సినిమాలో సునీల్ నటిస్తున్నాడనే వార్తలు వినిపించాయి. కొన్ని రోజుల తరువాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక సునీల్, చిరుకి హ్యాండ్ ఇచ్చాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అందులో నిజం లేదని సునీల్ తేల్చేశాడు. ”చిరంజీవి గారి సినిమాలో నేను నటించాలని మొదట నేనే వాళ్ళని అప్రోచ్ అయ్యాను.
అయితే మొదట నాకిచ్చిన పాత్రలో నటించడానికి డేట్స్ కుదరలేదు. ఆ సమయంలో ఈడు గోల్డ్ ఎహే సినిమా షూటింగ్ లో ఉన్నాను. అందుకే వేరే పాత్రలో నటిస్తున్నాను. ఓ నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటాను. అలానే త్రివిక్రమ్ గారితో ఖచ్చితంగా సినిమా చేస్తాను. అయితే ఆయనకొక స్పేస్ కావాలి. ఆ స్పేస్ కోసం ఎదురుచూస్తున్నాను” అని స్పష్టం చేశారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















