Am Rathnam: వీరమల్లు మూవీ గురించి ఏఎం రత్నం క్లారిటీ… ఏం చెప్పారంటే?

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ షూట్ మొదలై చాలా సంవత్సరాలు అయింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు. అయితే ఏఎం రత్నం తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు మూవీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు. హరిహర వీరమల్లు సినిమాకు సీక్వెల్ కూడా ఉందని ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు.

గతంలో ఈ సినిమా సీక్వెల్ గురించి వైరల్ అయిన వార్తలు నిజమేనని (Am Rathnam) ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి కూడా క్లారిటీ వస్తే బాగుంటుందని నెటిజన్లుచెబుతున్నారు. హరిహర వీరమల్లు1 ను వేగంగా విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. హరిహర వీరమల్లు1 2025 సంవత్సరంలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జూన్ నుంచి షూటింగ్ లలో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది. పవన్ వరుస సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus