AM Ratnam: విశ్వరూపం అనకండి సార్.. భయమేస్తుంది

కొన్ని స్పీచులు, డైలాగులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మరీ ముఖ్యంగా ఆడియో లాంచ్ లు లేదా ప్రీరిలీజ్ ఈవెంట్లలో దర్శకులు, హీరోలు, నిర్మాతలు మాట్లాడే మాటలు ఎన్నటికీ మరువలేరు అభిమానులు. ఒక్కో హీరో అభిమానులకు ఒక్కో రకమైన మాటంటే భయం. “ఇప్పటివరకు చూడలేదు కానీ.. ఎప్పుడో చూసామే అనిపిస్తుంది” అనే డైలాగ్ వినిపిస్తే చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిద్రలో కూడా జడుసుకుంటారు. ఇక “గుండెల మీద చెయ్యి వేసుకొని సినిమా చూడండి” అంటే చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడతారు. కానీ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్దగా డైలాగ్స్ అవసరం లేదు.. వాళ్లని భయపెట్టేది ఒకే ఒక్క పదం, అదే “విశ్వరూపం”. ఆ మాట వింటేనే తెగ ఇబ్బందిపడిపోతారు పవన్ ఫ్యాన్స్.

AM Ratnam

అప్పట్లో అజ్ఞాతవాసి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారు” అని ఇచ్చిన స్టేట్మెంట్ కి అప్పటికి ఫ్యాన్స్ హ్యాపీ ఫీలైనా.. సినిమా చూశాక మాత్రం నటవిశ్వరూపం అంటేనే చిరాకుపడేవారు. అలాంటిది నిన్న “హరిహర వీరమల్లు” చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ “ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు” అని చెప్పగానే ఒక్కసారిగా అందరికీ అజ్ఞాతవాసి ప్రీరిలీజ్ ఈవెంట్ స్పీచ్ గుర్తొచ్చింది.

సినిమా ఎలా ఉంది, అభిమానులకు, ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతుంది అనే విషయం పక్కన పెడితే.. విశ్వరూపం, నటవిశ్వరూపం లాంటి పదాలు కొన్నాళ్లు పవన్ కళ్యాణ్ సినిమా దర్శకులు, రచయితలు, నిర్మాతలు వాడకపోతే బెటర్. లేదంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టెన్షన్ తో పోయేలా ఉన్నారు. సినిమాలకి సెంటిమెంట్స్ ఉన్నట్లే ఫ్యాన్స్ కి కూడా సెంటిమెంట్స్ ఉంటాయి కదా. కాస్త కామెడీ అనిపించినా వాటిని ఫాలో అవ్వండి తప్పదు.

 ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus