Amala Paul: సోలోగా హాలీడే ట్రి ప్ ఎంజాయ్ చేస్తున్న అమలా పాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అయింది.. అప్పుడప్పుడు డబ్బింగ్ మూవీస్‌తో సందడి చేస్తోంది.. ఈమధ్య ‘పిట్టకథలు’ అనే ఆంథాలజీ ఫిలింతో పాటు ‘కడవేర్’ వెబ్ సిరీస్‌తోనూ ఆకట్టుకుంది.. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమలా.. ఆ తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని లాంటి హీరోలతో ఆడిపాడింది..

కొంత విరామం తర్వాత తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తుంది.. కార్తి ‘ఖైదీ’ రీమేక్ ‘భోళా’ తో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది.. ఇక బాలీవుడ్ సింగర్ బవేందర్ సింగ్‌ను అమల సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. అతడికి అమలా లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అమ్మడు రీసెంట్‌గా.. హాలీడే ట్రిప్‌కి వెళ్లింది.. అది కూడా సోలోగా.. ఎంచక్కా ప్రకృతి అందాలకు పరవశించిపోతూ.. జూపార్క్‌లో జంతువులతో సరాదాగా గడుపుతూ.. వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తోంది.. ఆ పిక్స్, వీడియోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది..

 

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus