మరో వివాహం చేసుకున్న అమలా పాల్ మాజీ భర్త

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను వివాహం చేసుకుని సినిమాలను తగ్గించింది. ఆ తరువాత కొన్ని మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మళ్ళీ అమల సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఆమె భర్త విజయ్ కూడా తాజాగా రెండో వివాహం చేసుకున్నాడు. ప్రముఖ డాక్టర్ ఐశ్వర్యను ఇటీవల పెళ్ళి చేసుకున్నాడు. వీరి పెళ్ళి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

amala-pauls-ex-husband-director-al-vijay-marries-r-aishwarya1

ఇక వీరిద్దరి వివాహం జూన్ 29న జరిగినట్టు ప్రకటించాడు విజయ్. తన సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో తన వివాహం జరిగినట్టు తెలిపాడు. ‘ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళని… తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నానని తన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus