అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

  • August 16, 2018 / 09:13 AM IST

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది. శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం. కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని చాలా ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. ఓ ఉంగ‌రం.. రాజు రాణి బొమ్మ‌లు టైటిల్ లో క‌నిపిస్తున్నాయి. ఇది చాలా కొత్త‌గా ఉంటూ సినిమాపై ఆస‌క్తిని పెంచేసింది. ఈ కాన్సెప్ట్ పోస్ట‌ర్ తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ చిత్ర షూటింగ్ అంతా యుఎస్ లోనే జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం న్యూయార్క్ లో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఇలియానా ఈ చిత్రంలో ర‌వితేజ జోడీ క‌డుతుంది. విజ‌య్ సి దిలీప్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus