శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటించిన “అమర్ అక్బర్ ఆంటోనీ” నవంబర్ 16న విడుదలవుతున్న విషయం తెలిసిందే. నిన్న శ్రీనువైట్ల కానీ ఇవాళ రవితేజ కానీ సినిమా కథ ఏమిటనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఎంతసేపూ రివెంజ్ డ్రామా అని చెబుతున్నారే కానీ బేసిక్ స్టోరీ ఏమిటనేది మాత్రం చెప్పడం లేదు. అయితే.. మొన్న సెన్సార్ పూర్తవ్వడంతో సినిమా కథ ఇదేనంటూ ప్రచారం మొదలైంది. సినిమాలో రవితేజ చిన్నప్పుడే అతడి కళ్ల ముందే తల్లిదండ్రుల్ని చంపేసిన విలన్లు.. ఆ హత్యలు ఆ కుర్రాడే చేసినట్లుగా చిత్రించి అతడ్ని జైల్లో పెట్టించి తప్పించుకొన్నామ్ అనుకుంటారు. కానీ.. ఆ కుర్రాడు పెరిగి పెద్దై రవితేజ అవుతాడు. పగతో రగిలిపోతే.. తన తల్లిదండ్రుల్ని చంపినవారిని ఒక్కొక్కరిగా హతమారుస్తాడు. ఈలోపు చిన్నప్పటి నుంచి జైల్లో పెరిగిన కారణంగా మెంటల్ గా డిస్టర్బ్ అయిన రవితేజ స్ప్లిట్ పర్సనాలిటీతో బాధపడుతుంటాడు. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ నుంచి వచ్చిన క్యారెక్టర్సే అక్బర్ & ఆంటోనీ అని చెప్పుకొంటున్నారు.
ఈ ప్రచారం జరగబడుతున్న కథ నిజమో, అబద్ధమో తెలియదు కానీ.. నిజం అయితే మాత్రం మంచి కథ అనే చెప్పొచ్చు. ఈ కథకు శ్రీనువైట్ల ఫార్మాట్ కామెడీ యాడ్ అయితే.. “అమర్ అక్బర్ ఆంటోనీ” మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “వెంకీ, దుబాయ్ శీను”ల రేంజ్ లో హిట్ అవ్వడం ఖాయం. ఇలియానా ఆరేళ్ళ తర్వాత తెలుగులో నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలుగుతుందో లేదో చూడాలి.