Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ పై అమర్ దీప్ కామెంట్స్..! హౌస్ లో ఏం జరుగుతోందంటే.?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగానే మారింది. అస్సలు ఊహించనిది జరగుతుంది అని ముందుగానే చెప్పినట్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరూ పహిల్వాన్స్ ని తీస్కుని వచ్చి హౌస్ మేట్స్ తో టాస్క్ పెట్టాడు బిగ్బాస్. నామినేషన్స్ తర్వాత ఈవారం కొన్ని ఛాలెంజస్ లో పాల్గొనాలని అందులో గెలిచిన వాళ్లకి ఏకంగా 5వారాల పాటు ఇమ్యూనిటీ లభిస్తుందని, అంతేకాకుండా చాలామందికి పవర్ అస్త్రం కూడా వస్తుందని చెప్పాడు బిగ్ బాస్.

ఇందులో భాగంగా ఫేస్ టు బీస్ట్ అంటూ కుస్తీ పోటీలని నిర్వహించాడు. ముందుగా గార్డెన్ ఏరియాలో ఈ సెటప్ వేసినా వర్షం కారణంగా దీనిని యాక్టివీటీ ఏరియాకి మార్చారు. ఇందులో ఒక మేల్ – ఫిమేల్ పహిల్వాన్స్ బయట నుంచీ వచ్చి హౌస్ మేట్స్ తో టాస్క్ లో పాల్గొన్నారు. ఎవరైతే ఎక్కువ సేపు రింగ్ లో నిలవగలుగుతారో వారికి తదుపరి ఛాలెంజ్ ఆడే అవకాశం వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ తమ పూర్తి స్థాయి ఎఫోర్ట్స్ ని పెట్టారు.

ఇక్కడే పల్లవి ప్రశాంత్ పహిల్వాన్ కాళ్లు పట్టుకుని ఎక్కువ సేపు బరిలో నిలిచే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అమర్ దీప్ , సందీప్, ప్రిన్స్, గౌతమ్ లు కూడా బాగానే పోరాడారు. ఫైనల్ గా ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక, మేల్ కంటెస్టెంట్స్ లో సందీప్ ఇద్దరూ ఎక్కువ సేపు ఉన్నట్లుగా బిగ్ బాస్ ఎనౌన్స్ చేశాడు. దీంతో పల్లవి ప్రశాంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఏడ్చాడు. ప్రిన్స్, శుభశ్రీ, రతికలు పల్లవిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

అయితే, దీనికి ఆడియన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. పల్లవి ప్రశాంత్ కావాలనే సింపతీ కార్డ్ తీసి గేమ్ ఆడుతున్నాడని, లాస్ట్ టైమ్ కూడా రెండు అన్నం మెతుకులు కింద పడిపోతే వాటిని కెమెరాకి చూపించాడని ఇదంతా కూడా సింపతీ కోసమే ఆడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు,. ఇక కుస్తీ పోటీలు పూర్తి అయ్యాక రాత్రి అమర్ దీప్ బెడ్ పైన పడుకుని పల్లవి ప్రశాంత్ కావాలనే కింద పడుకుంటున్నాడని,

మనం అస్సలు ఏమీ చెప్పకపోయినా అలా పడుకోవడం కరెక్ట్ కాదని ఇదంతా బయట ఆడియన్స్ కి వేరేవిధంగా అర్ధం అయ్యే ఛాన్స్ ఉందని సందీప్ తో మాట్లాడాడు. మరోవైపు శివాజీ పల్లవి ప్రశాంత్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడని, ముందు ముందు టాస్క్ లలో తనని కొట్టడం చాలా కష్టం అని మిగతా హౌస్ మేట్స్ తో చెప్పాడు. ఇక ఇప్పట్నుంచీ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ పట్ల మిగతా హౌస్ మేట్స్  (Bigg Boss 7 Telugu) జాగ్రత్తగా ఉంటారని అర్థం అవుతోంది.

ఏది ఏమైనా ఎలాంటి అంచనాలు లేకుండా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వచ్చి తనదైన స్టైల్లో గేమ్ ని ప్రారంభించాడు. ఇప్పటి వరకూ తన గేమ్ లో ఎక్కడా కూడా సింపతీ కావాలని చూపించినట్లుగా అయితే తెలియలేదు. మరి ముందు ముందు ఏమైనా బరెస్ట్ అయి తన ఒరిజినాలిటీని చూపిస్తాడా ? లేదా అనేది చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus