Amaran Collections: ‘అమరన్’.. 9 రోజుల కలెక్షన్స్..లాభం ఎంత?

శివ కార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి(Sai Pallavi)..ల ‘అమరన్'(Amaran) చిత్రం సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్..లోకి ఎంట్రీ ఇచ్చింది. అయినా ఇప్పటికీ డీసెంట్ షేర్స్ వస్తున్నాయి. కమల్ హాసన్ (Kamal Haasan)  నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)  దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రెండో వీకెండ్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

Amaran Collections:

ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.04 cr
సీడెడ్ 1.92 cr
ఉత్తరాంధ్ర 2.01 cr
ఈస్ట్+వెస్ట్ 0.79 cr
కృష్ణా + గుంటూరు 1.15 cr
నెల్లూరు 0.35 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 12.26 cr

‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 9 రోజుల్లో రూ.12.26 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.7.26 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

కన్నప్ప లీక్‌పై 5 లక్షల బహుమతి!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus