Amardeep Wife Tejaswini: అమర్ దీప్ పై భార్య తేజస్విని షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు అమర్ దీప్. బయట అతన్ని చూసిన ఎవరైనా ఇతను బిగ్ బాస్ గేమ్స్ కి కరెక్ట్ గా సూట్ అవుతాడు అని అనుకుంటారు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అమర్ దీప్ అందరినీ షాక్ కి గురి చేసాడు. ఆశించిన స్థాయిలో గేమ్ ఆడడం లేదు. చాలా చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్నోడు అని చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యింది.

ఇతన్ని చూసి జాలి పడాలో, కోపం తెచ్చుకోవాలో తెలియని స్థితిలోకి కంటెస్టెంట్స్ ని మరియు ఆడియన్స్ ని అయ్యోమయ్యం లో పడేసాడు. ఈ వారం అయితే నామినేషన్స్ తర్వాత మొదటి మూడు రోజులు మానసికంగా అమర్ దీప్ చాలా డల్ అయిపోయాడు. ఇంతకాలం తనలో ఉన్న తప్పులను సరిచేసుకునే ప్రయత్నం అయితే చాలా గట్టిగానే చేసాడు. అతని గ్రాఫ్ నెమ్మదిగా పెరగడం ప్రారంభం అయ్యింది.

అయితే అమర్ దీప్ (Amardeep) బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందే అతని భార్య తేజస్విని ఉన్న నిజాలను ఉన్నట్టుగా అమరదీప్ కి చెప్పిందట. నువ్వు బిగ్ బాస్ లో నెగ్గుకు రాలేవు, నీకు ఇలాంటివి అసలు సెట్ అవ్వవు, కానీ అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళు. కాకపోతే నీలో చాలా నెగేటివ్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకో అని చెప్పిందట. ఎక్కువగా హైపర్ అవ్వకు, అన్నిటికి తొందరపడకు,

ఎవరితోనైనా ఇంతలో ఉండాలో, అంతలోనే ఉండు, ఎక్కువగా ఎవరికీ కనెక్ట్ కాకు, నీ ఆట మీద మాత్రమే ఫోకస్ చెయ్యి అని ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపిందట. కానీ అమర్ దీప్ ఒక్కటి కూడా పాటించలేదు మొదటి 5 వారాల్లో. కానీ ఇప్పుడు మాత్రం అతను నిజమైన గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. బహుశా భార్య చెప్పిన మాటలు బాగా గుర్తుకు వచ్చాయేమో అని అంటున్నారు నెటిజెన్స్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus