ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి విజయం అందుకున్న చిత్రాల్లో ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ ఒకటి. సుహాస్, శివానీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దుశ్యంత్ కటికనేని తెరకెక్కించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి సర్వం సిద్ధమైంది. ‘ఆహా’ వేదికగా ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నారు. ‘త్వరలోనే మీ ముందుకు ఈ సినిమా వస్తుంది’ సినిమా టీమ్, ఓటీటీ టీమ్ అనౌన్స్ చేశారు.
తాజాగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేస్తూ మరో పోస్ట్ చేశారు. మార్చి 1 నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు సుహాస్ చేసిన ఈ డేరింగ్ అటెంప్ట్‌ను చూడొచ్చు. ఆ అటెంప్ట్ ఏంటి అనేది థియేటర్లలో చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. లేదంటే ఓటీటీలో చూడాల్సిందే. ఇక ఈ సినిమా అంబాజీ పేట నేపథ్యంలో సాగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంబాజీపేట మ్యారేజి బ్యాండులో ఓ సభ్యుడు మల్లి (సుహాస్).
చిరతపూడిలో తన కుటుంబంతో కలసి నివసిస్తుంటాడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) ఆ ఊరి స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంటుంది. ఊరి మోతుబరి వెంకట్‌బాబు (నితిన్ ప్రసన్న) వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని ఓ వదంతు మొదలవుతుంది. అంతేకాదు వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే వదంతు కూడా వస్తుంది. ఇంతలో వెంకట్‌బాబు చెల్లెలు లక్ష్మి (శివాని నాగారం), మల్లి ప్రేమలో పడతారు.
దీంతో వెంకట్‌బాబు తమ్ముడికి, మల్లికి మధ్య ఊళ్లో గొడవ అవుతుంది. ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకీ, వెంకట్‌బాబుకీ వైరం మొదలవుతుంది. చిన్నగా మొదలైన గొడవలు, మరింత పెద్దవిగా మారుతాయి. ఇంతలో మల్లి, లక్ష్మి మధ్య ప్రేమ సంగతి బయటపడుతుంది. దీంతో ఎలాగైనా మల్లి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని వెంకట్‌బాబు ఓ రోజు రాత్రి పద్మని స్కూల్‌కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే సినిమా కథ.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!