స్టార్ సెలబ్రిటీల కేసులో సంచలన తీర్పు!

హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. నటుడు జానీ డెప్‌(58), అతని మాజీ భార్య అంబర్‌ హర్డ్‌(36) ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనంటూ పేర్కొంటూనే.. డెప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కోర్టు. దాదాపు ఆరువారాల పాటు ఈ కేసు సాగింది. నటి అంబర్ హర్డ్ తన మాజీ భర్తకు 15 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని జ్యూరీ తెలిపింది.

2018లో ఆమె రాసిన సెక్సువల్‌ వయొలెన్స్‌ ఆర్టికల్‌.. జానీ డెప్ పరువుకు భంగం కలిగించేలా ఉందని.. దాని ఆధారంగానే ఆమె అతడిపై వేధింపులకు పాల్పడిందని అంచనాకు వచ్చామని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం అంబర్‌ ఏడ్చేసింది. తన గుండె బద్ధలైందని.. ఈ తీర్పు తనకే కాదని.. మహిళలందరికీ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించింది. జానీ తన పరపతితోనే ఈ కేసు గెలిచాడంటూ ఆరోపణలు చేసింది.

బ్యాక్ గ్రౌండ్ స్టోరీ:

2015లో జానీ డెప్‌, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. ఆ తరువాత అంబర్.. జానీ డెప్‌ పేరును ప్రస్తావించకుండా.. వైవాహిక జీవితపు హింస గురించి.. 2018లో ది వాషింగ్టన్‌ పోస్టులో ఒక కథనం రాసింది. దాని ఆధారంగా 50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2019 ఫిబ్రవరిలో కోర్టుకెక్కాడు జానీ. అంతేకాదు.. అంబర్ తనను టార్చర్ చేసిందని.. అవమానించిందని, ఓ ప్రముఖ వ్యాపారవేత్త(ఎలన్ మస్క్)తో ఎఫైర్ నడిపించిందని.. అదే ఆమెని ప్రభావితం చేసిందంటూ దావాలో పేర్కొన్నాడు.

దీనికి వ్యతిరేకంగా 2020 ఆగస్టులో తానూ గృహహింస ఎదుర్కొన్నానని.. జానీడెప్, ఆయన లాయర్ నుంచి అసత్య ప్రచారాలను ఎదుర్కొంటున్నట్లు 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది. ఈ దావాల్లో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. జూన్‌ 1న తీర్పు జానీ డెప్‌కు అనుకూలంగానే వచ్చినా.. అంబర్‌ హర్డ్‌ ప్రత్యారోపణలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిగా 2 మిలియన్‌ డాలర్లను చెల్లించాలంటూ జానీ డెప్‌ ను ఆదేశించింది వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్‌ కోర్టు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus