బద్రి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. ఈ భామ బద్రి సినిమాతో అప్పట్లో చాలా మందికి ఫేవరేట్ హీరోయిన్ అయింది. ఆ తరువాత మహేష్ బాబు తో నాని , ఎన్ఠీఆర్ తో నరసింహుడు, బాలయ్య తో పరమవీరచక్ర మూవీస్ లో నటించింది. అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. 2023లో వచ్చిన గదర్ 2 సూపర్ హిట్ సాధించటంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా స్టార్ట్ చేసింది.
ఈ మధ్య పెళ్లి, డేటింగ్ లపై ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన వయసులో సగం వయసు ఉన్న వాళ్ళు తనను డేటింగ్ కి రమ్మని అడుగుతున్నారని, అది చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించిందన్నారు. అంతే కాక ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని, మన మనసు మెచూర్డ్ గా ఉంటే అంత బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. అలా అర్ధం చేసుకునే వాళ్లు దొరికితే వయసుతో సంబంధం లేకుండా నేను రెడీ అంటుంది ఈ భామ.
అయితే ఈ భామ 50 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. తన కెరీర్ మంచి దశలో వున్నప్పుడు అనుకున్న పెళ్లి సంబంధాలు విషయంలో అందరు సినిమాలు మానేయాలని అనటంతో తనకు పెళ్ళికంటే కెరీర్ ఏ ముఖ్యమని పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది అమీషా.