రజనీకాంత్ నటనకు పునాది వేసిన గురువు, ప్రముఖ దర్శకుడు కె.ఎస్. నారాయణస్వామి (92) మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న రజనీకాంత్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ మాత్రమే కాదు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి వంటి పలువురు స్టార్‌లు కూడా నారాయణస్వామి వద్ద శిక్షణ పొందారు. పరిశ్రమలో ఆయనను కె.ఎస్. గోపాల్ అనే పేరుతో కూడా పిలిచేవారు. గురువుగానే కాకుండా దర్శకుడిగా కూడా సినీ రంగానికి విశేష సేవలు అందించిన ఆయన, మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ మరియు మద్రాస్ దూరదర్శన్ కేంద్రంలో కీలకపాత్రలు పోషించారు.
బాలచందర్ వంటి దిగ్గజాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా నారాయణస్వామిదే. మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, దూరదర్శన్‌లో సేవలందించిన నారాయణస్వామి, దర్శకుడిగా కూడా చిరస్మరణీయ చిత్రాలను అందించారు. సినీ ప్రపంచానికి అంకితభావంతో పనిచేసిన ఈ మహనీయుని సేవలను ఇండస్ట్రీ ఇంకా స్మరించుకుంటూనే ఉంది. 92 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఆయన చివరి శ్వాస విడిచారు.
కూలి మూవీతో హిట్ అందుకున్న రజిని కాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్నారు మేకర్స్. దీని తర్వాత కమలహాసన్ నిర్మాణంలో రజిని ఒక చిత్రం చేయనున్నారు.