ఓ హీరో పై సీనియర్ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ‘బద్రి’ బ్యూటీ అమీషా పటేల్ గుర్తుందా? చాలా కాలం గ్యాప్ తర్వాత ‘గదర్-2’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ, తన క్రష్ ఎవరో రివీల్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆ క్రష్ మరెవరో కాదు.. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్.టామ్ క్రూజ్ అంటే తనకు పిచ్చి ప్రేమ అని, చిన్నప్పటి నుంచి అతడికి వీరాభిమానిని అని అమీషా ఓపెన్ అయిపోయింది. “నా స్కూల్ పెన్సిల్ బాక్స్, ఫైల్స్‌పై కూడా టామ్ క్రూజ్ ఫొటోలే ఉండేవి. నా రూమ్‌లో ఉన్న ఏకైక పోస్టర్ కూడా ఆయనదే. అతను నా ఆల్-టైమ్ క్రష్. అతని కోసం ఏదైనా చేస్తా” అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాదు, “అతనితో ఒక్క రాత్రి గడపడానికి కూడా నేను సిద్ధం. అవకాశం వస్తే పెళ్లి కూడా చేసుకుంటా” అంటూ ఓపెన్‌గా మాట్లాడి అందరికీ షాకిచ్చింది.ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ, తనకు వివాహ బంధంపై నమ్మకం ఉందని, సరైన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అమీషా స్పష్టం చేసింది.కెరీర్ విషయానికొస్తే, 2023లో వచ్చిన ‘గదర్-2’తో అమీషా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘తౌబా తేరా జల్వా’ అనే చిత్రంలో కనిపించినా, ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రకటించలేదు.