నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమిగోస్’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఆషిక రంగనాథ్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే కళ్యాణ్ రామ్ నటన కోసం కచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు అని..
సినిమా బాగుంది అన్న వాళ్ళు, బాగోలేదు అన్న వాళ్ళు కూడా కామన్ గా చెప్పిన పాయింట్. అయితే ఓపెనింగ్స్ మాత్రం ‘బింబిసార’ రేంజ్ లో లేవు. మొదటి వీకెండ్ జస్ట్ యావరేజ్ అనిపించే విధంగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 1.25 cr |
సీడెడ్ | 0.69 cr |
ఉత్తరాంధ్ర | 0.54 cr |
ఈస్ట్ | 0.41 cr |
వెస్ట్ | 0.24 cr |
గుంటూరు | 0.51 cr |
కృష్ణా | 0.24 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.28 cr |
ఓవర్సీస్ | 0.60 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.08 cr (షేర్) |
‘అమిగోస్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.5.08 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.10.42 కోట్ల షేర్ ను రాబట్టాలి.
వీకెండ్ ఈ మూవీ జస్ట్ యావరేజ్ అనే విధంగానే కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో స్ట్రాంగ్ గా నిలబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు అనే చెప్పాలి.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!