స్టార్ హీరో ప్రభాస్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి, బాహుబలి, బాహుబలి2 సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో బాహుబలి3 తెరకెక్కే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప్రభాస్, రాజమౌళి ఈ మధ్య కాలంలో కలిసి కనిపించలేదనే సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరూ ప్రముఖ బీజేపీ నేత, కేంద్ర మంత్రి (Amit Shah) అమిత్ షాను కలవనున్నారని సమాచారం. ఈ నెల 15వ తేదీన ఖమ్మంలో జరగనున్న సభకు అమిత్ షా హాజరు కానున్నారు. ఈ నెల 14వ తేదీన అమిత్ షా హైదరాబాద్ లో ల్యాండ్ జరగనుందని తెలుస్తోంది. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా వీళ్లిద్దరినీ కలవనున్నారు. ప్రభాస్, రాజమౌళితో పాటు మరో ఇద్దరు ప్రముఖులను అమిత్ షా కలవనుండగా వాళ్లిద్దరూ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.
రాష్ట్రాల పర్యటనలో భాగంగా అమిత్ షా సినీ ప్రముఖులను కలుస్తున్నారు. గతంలో కూడా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మిథాలీ రాజ్ పలువురు ప్రముఖులను కలిసిన సంగతి తెలిసిందే. ప్రభాస్, జక్కన్న అమిత్ షాను కలిస్తే సోషల్ మీడియాలో ఈ భేటీ హాట్ టాపిక్ అవుతుంది. ఈ సెలబ్రిటీల అభిమానుల అభిమానాన్ని గెలుచుకోవడానికి అమిత్ షా ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్, జక్కన్నలకు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్, జక్కన్నలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్, జక్కన్న రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.