తన మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టే రామ్ గోపాల్ వర్మ ఏడవడమా? నమ్మలేక పోతున్నారా? ఇది నిజం. వర్మ కన్నీరు పెట్టుకున్న సందర్భం నిన్న జరిగింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇందుకు కారణం. వర్మ ప్రస్తుతం అమితాబ్‌తో ‘సర్కార్-3’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్, అమితాబ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సుభాష్ ‘వర్మ చేసే సినిమాలేవీ స్థిరత్వంగా ఉండవు. అలాంటి దర్శకుడితో కలిసి పనిచేయడంపై మీ అభిప్రాయాలేంటి’ అని అమితాబ్ ని అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘స్థిరత్వం లేకపోవడమనేది నిజంగా ఓ విచిత్రమే. వర్మది ఎప్పుడూ విరామం లేకుండా సృజనాత్మకంగా ఆలోచించే మనస్తత్వం. తన ఆలోచనల్లోంచే అతను ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటాడు.
వర్మ అస్థిరత్వం అతనికి ఎప్పుడూ మంచి ఫలితాలనే అందివ్వకపోవచ్చు. కానీ, ఓ దర్శకుడిగా, నిర్మాతగా స్థిరంగా ఉండగలుగుతున్నాడు. అతను చేసే ఏ కొత్త ప్రయత్నమైనా నూతనత్వం కోసం చేసే అధ్యయనాలేన’ని చెప్పారు. వర్మని అంత గొప్పగా ఎవరూ వర్ణించలేరు. సొంతంగా వర్మ చెప్పుకోమన్న అలా సమర్ధించుకోలేరు. అందుకే ఆ ఇంటర్వ్యూ చూసి వర్మ కన్నీళ్లు ఆపుకోలేకపోయారని తెలిసింది. దాదాపు కొన్నేళ్లుగా మంచి హిట్ అందుకోలేక, ట్వీట్ లతో వివాదాల్లో ఇరుక్కుంటున్న వర్మకు అమితాబ్ మాటలు చాలా ఆనందాన్ని కలిగించిందని సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.