Amitabh,Rashmika: గుడ్ బై సినిమాలో నటించిన సంతోషంగా ఉంది: అమితాబ్

నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. పుష్ప సినిమాతో ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు రావడంతో వరుస హిందీ అవకాశాలను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్నటువంటి గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. రష్మిక హిందీలో నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ఈమె ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె ఈ సినిమాలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమార్తె పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించినటువంటి ఈమె ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోతో కలిసిన నటించడం నిజంగా నా అదృష్టం. ఇలా నా మొదటి బాలీవుడ్ సినిమాను అలాంటి స్టార్ హీరోతో నటించడం ఎంతో ఆనందంగా ఉంది

అంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక చొప్పడంతో వెంటనే అమితాబచ్చన్ కూడా గుడ్ బై సినిమాలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బీ ఇలా రిప్లై ఇవ్వడంతో రష్మిక సంతోషంలో తేలిపోతుంది. ఈ విధంగా అమితాబచ్చన్ రష్మిక కామెంట్లకు రెస్పాండ్ కావడం ఇది మొదటిసారి కాదు.

మొదటిసారిగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో, రష్మిక అమితాబచ్చన్ కలిసినప్పుడు ఆమెకు బిగ్ బీ నుంచి ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 7వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాపై రష్మిక ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మరి ఈమె డెబ్యూ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus