Amitabh: కడుపునిండా అన్నం తినడానికి డబ్బులు ఉండేవి కాదు: అమితాబ్

బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని బాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. ఇలా ఆరు దశాబ్దాల సినీ కెరియర్ లో అమితాబ్ చేయని పాత్ర అంటూ లేదు. ప్రస్తుతం ఈయన ఎనిమిది పదుల వయసులో ఉన్నప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో తన వ్యక్తిగత విషయాలను గురించి తెలియజేస్తూ ఉంటారు.ఇదివరకు వీరి ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించిన అమితాబ్ తాజాగా తాను సినిమాలలోకి రాకముందు కడుపునిండా అన్నం తినడం కోసం ఎంతో కష్టపడ్డాను అంటూ తన కష్టాలు గురించి చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను ఇండస్ట్రీ లోకి రాకముందు కలకత్తాలోపనిచేసే వాడిననీ తెలిపారు. ఇలా అక్కడ పనిచేయడంతో తనకు నెలకు 300 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేవారు. ఇలా తక్కువ జీతంతో ప్రతిరోజు కడుపునిండా అన్నం తినడానికి సరిపోయే డబ్బులు ఉండేవి కాదు అందుకే పానీపూరీలు తినీ కడుపు నింపుకున్నాను

అంటూ ఈ సందర్భంగా అప్పటి కష్టాలను అమితాబ్ తెలియజేశారు.ఇలా ఒకప్పుడు కడుపునిండా భోజనం చేయడానికి డబ్బులు లేనటువంటి స్థితి నుంచి ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతిగా ఎదిగారు. ఇలా తన కన్నీటి కష్టాలు గురించి అమితాబ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus