ప్రభాస్ హీరోగా రూపొందిన మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. జూన్ 16 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్ల డోస్ కూడా పెంచింది టీం. ప్రభాస్ హిందీలో నటించిన మొదటి స్ట్రైట్ మూవీ ఇది. కృతి సనన్ హీరోయిన్. ఇదిలా ఉండగా.. ‘ఆదిపురుష్’ కోసం చిత్ర బృందం ‘అమ్మోరు’ ఫార్ములా వాడుతుందట. అదేంటి అంటే.. ఆదిపురుష్ థియేటర్లోని టికెట్లన్నీ అమ్మినా.. ఒక్క టికెట్ మాత్రం అమ్మకుండా వదిలేస్తారు.
ఆ ఒక్క టిక్కెట్ హనుమంతుడి కోసం వదిలేస్తారట. రామాయణ పారాయణం ఎక్కడ జరుగుతున్నా.. అక్కడికి హనుమంతుడు వస్తాడన్నది హిందువుల నమ్మకం. అందుకే ఆ ఒక్క సీటూ హనుమంతుడు కోసం ఉంచేస్తారన్న మాట. (Adipurush) సినిమా పబ్లిసిటీకి ఇది మరింత ఉపయోగపడుతుంది అని అంతా భావిస్తున్నారు. దీనికి కారణం థియేటర్ అంతా నిండినా ఒక్క సీటు ఖాళీగా ఉంటే.. అందరూ ఆ ఒక్క సీటునే చూస్తారు. ఈ క్రమంలో అక్కడ హనుమంతుడి ప్రతిమ ఉంచితే.. ప్రేక్షకులు మొత్తం భక్తి మూడ్ లోకి వచ్చేస్తారు.
‘అమ్మెరు’ సినిమా టైంలో ఇలాంటిది చేశారు. అయితే అది చిత్ర బృందం ప్లాన్ చేసింది కాదు. థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులు కలిసి చేసింది. సినిమా ప్రదర్శింపబడుతున్న టైంలో హారతులు పట్టడం.. థియేటర్ బయట ఓ చిన్న గుడి పెట్టడం వంటివి చేశారు. అక్కడ పూజలు, హుండీలూ, ప్రసాదాలూ వంటివి కూడా ఏర్పాటు చేశారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినప్పటికీ.. ఇలాంటి వాటి వల్ల ఆ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగాయి.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు