‘బిందాస్’ ‘మిర్చి’ ఈ రెండు క్రేజీ చిత్రాల వెనుక ఓ పెద్ద కథ ఉంది. మొదట ‘బిందాస్’ కథ గురించి చెప్పుకుంటే.. ‘తన శత్రువుల వల్ల తన కుటుంబానికి అలాగే ఊరికి ప్రమాదం ఉందని. ఆ గొడవలు ఎలాగైనా తగ్గి తన ఊరు, కుటుంబం బాగుండాలి అని ఆరాట పడే ఓ పెద్ద. సడెన్ గా ఆ ఇంటి పెద్ద ఇంట్లో ఉండే హీరో వల్ల ఆ గొడవలు మరింత ఎక్కువ అవుతాయి. దీంతో హీరోని తన ఇంటి నుండీ ఆ ఊరి పెద్ద బయటకు నెట్టేస్తాడు.
ఈ క్రమంలో ఆ గొడవలను ఆపడానికి శత్రువు ఇంటికి వెళ్ళి సెటిలయ్యి వారి మనసు మారుస్తాడు హీరో. ఇక ‘మిర్చి’ కథ కూడా అంతే. కానీ ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ‘బిందాస్’ చిత్రానికి వీరు పోట్ల దర్శకుడు. ‘మిర్చి’ కి కొరటాల శివ దర్శకుడు. అయితే ‘బిందాస్’ చిత్రాన్ని ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ అధినేత అనిల్ సుంకర నిర్మించాడు. ఈ చిత్రం ఎబొవ్ యావరేజ్ రేంజ్ మాత్రమే ఆడింది.. కానీ ‘మిర్చి’ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. 2010 ఫిబ్రవరి 5న ‘బిందాస్’ విడుదల కాగా… 2013 ఫిబ్రవరి 8న ‘మిర్చి’ విడుదలైంది.
అయితే ‘మిర్చి’ కథను కొరటాల శివ ముందుగా అనిల్ సుంకర కు వినిపించాడట. అయితే ‘అదే లైన్ ‘బిందాస్’ గా తీసాం కథా… మళ్ళీ అలాంటి లైన్ నే మేము తీస్తే ఎంత వరకూ కరెక్ట్’ అంటూ కొరటాల శివ ను ప్రశ్నించాడట అనిల్ సుంకర. దాంతో కొన్ని మార్పులు చేసి నిర్మాతలుగా మారదాం అనుకుంటున్న ‘యూవీ క్రియేషన్స్’ వారికి వినిపించాడట కొరటాల. అలా అది వారు ప్రభాస్ తో నిర్మించడం జరిగిందని తెలుస్తుంది.