Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఈ బజ్‌ హాని చేయదు కదా!

‘ఉప్పెన’ సినిమా వచ్చి చాలా రోజులైంది. వైష్ణవ్‌ తేజ్‌ మంచి బజ్‌ కూడా వచ్చింది. లుక్స్‌, నటన, స్క్రీన్‌ ప్రజెన్స్‌ విషయంలో మంచి పేరే వచ్చింది. తర్వాతి సినిమా ‘కొండపొలం’ (వర్కింగ్‌ టైటిల్‌) రెడీ అయినా, విడుదలకు సంబంధించి దర్శకుడు క్రిష్‌ ఇంకా ఏమీ మాట్లాడటం లేదు. ఈ క్రమంలో వైష్ణవ్‌ కొత్త సినిమా మొదలెట్టేశాడు. గిరీశయ్య దర్శకత్వంలో ఇటీవల కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. అయితే ఏంటి.. అంత హిట్‌ కొట్టి ఒక్క సినిమానే ఓకే చేశాడా? అని అందరూ అనుకుంటుడగా… అంత లేదు చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయంటూ కొత్త బజ్‌ పుట్టుకొచ్చింది.

ముందు మనం చెప్పుకున్నట్లు వైష్ణవ్‌ తేజ్‌ చుట్టూ దర్శకులు, నిర్మాతల చక్కర్లు కొడుతున్నారట. కథలు పట్టుకుని తిరుగుతున్న దర్శకుల గురించి చూసుకుంటే ‘ఉప్పెన’ హిట్‌ ఇచ్చిన బుచ్చిబాబు ఓ కథ సిద్ధం చేశారని గతంలోనే వార్తలొచ్చాయి. అక్కినేని నాగార్జున నిర్మాణంలో కొత్త దర్శకుడితో ఓ సినిమా ఉండనుంది. దీనికోసం దర్శకుడి వేట కొనసాగుతోంది. సుకుమార్‌ శిష్య బృందంలో ప్రణవ్‌ అనే కుర్రాడు కూడా ఓ కథ సిద్ధం చేసి, నిర్మాతను పట్టే పనిలో ఉన్నారట. వీళ్లు కాకుండా వెంకీ కుడుముల కూడా ఓ కథ సిద్ధం చేశాడట.

పైన చెప్పిన దర్శకుల సినిమాలు పట్టాలెక్కొచ్చు.. మెటీరియలైజ్‌ కాకపోవచ్చు. అయితే ఇలా ‘బిజీ’ బజ్‌ అంత మంచిది కాదనే మాటలూ వినిపిస్తున్నాయి. స్టార్‌ హీరోలకు ఇలా ‘బిజీ’ ట్యాగ్ పడితే మంచిదే కానీ. కొత్తగా వచ్చిన కుర్రాళ్లకు ఇలాంటి ట్యాగ్‌ మంచిది కాదు. ఆ హీరోతో సినిమా అని ఎవరైనా అనుకుంటే, అదేంటి చాలా బిజీ అయిపోయాడు కదా, నీ కథ వింటాడో లేదో అనే మాట వినిపిస్తుంది. దీంతో కొత్త సినిమా అవకాశాలు తగ్గుతాయి. సో వైష్ణవ్‌ జర చూసుకో.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus