‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ గురించి ఆసక్తికర విషయాలు..!

సోషల్ మీడియా పుణ్యమా అని పాత సినిమా ముచ్చట్లు అన్నీ తెలుస్తున్నాయి. రేర్ పిక్స్, ఫోటో స్టోరీస్, క్లాసిక్ మూవీస్, రికార్డ్స్, కలెక్షన్స్ వంటివన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి.. హీరోల అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఇలాంటివి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక మీమ్స్ అనేవి సినిమాల వల్లే క్లిక్ అయ్యాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరుకు కొన్ని చిత్రాల మధ్య అనూహ్యమైన పోలికలు కుదరడం చూశాం. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ నటించిన రెండు సినిమాల మధ్య ఆసక్తికరమై పోలికలు కుదిరాయి.

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’.. ఈ రెండు చిత్రాలూ మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా లవ్, ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కడంతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ కి స్టార్ రైటర్ త్రివిక్రమ్ కథ, మాటలు రాశారు. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు.

వెంకీని అతని తండ్రి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని తన స్నేహితుడి దగ్గరకు పంపుతాడు. అప్పటికే ఫ్రెండ్ కూతురు నందుకి ఎంగేజ్‌మెంట్ అయిపోయి ఉంటుంది. వెంకీ, నందుల పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారడం.. చివరికి ఏమైందనేదే కథ అని అందరికీ తెలుసు..

ఇక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ విషయానికొస్తే.. గణేష్ (వెంకటేష్), వాసు (శ్రీరామ్) మంచి ఫ్రెండ్స్.. తను పనిచేసే చోట కీర్తి (త్రిష)ని చూసి ప్రేమలో పడతాడు.. అలా జీవితం సాఫీగా సాగిపోతుండగా.. హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో కొద్దిరోజులు వాసు వాళ్ల ఊరికి తీసుకెళ్తాడు. అప్పటికే వాసు, కీర్తిలకు నిశ్చితార్థం అయిపోతుంది. అందుకే గణేష్‌ని దూరం పెడుతుంటుంది. తర్వాత గణేష్ వాళ్ల ఫ్యామిలీతో ఎలా కలిశాడు?.. వాళ్ల పెళ్లి ఎలా జరిగింది అనే కథా కమామీషు చూశాం..

పోలికలు ఏంటంటే..

‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’.. ఈ రెండు చిత్రాల్లోనూ హీరో కలవడానికి ముందే హీరోయిన్లకి వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది.. ఇద్దరితోనూ ప్రేమలో పడతాడు.. విబేధాలొస్తాయి.. చివరికి పెద్దలే వీళ్ల ప్రేమను అంగీకరించి వివాహం జరిపిస్తారు. అదీ సంగతి.. ‘‘సింగిల్‌గా ఉన్న అమ్మాయిని ఎవడైనా లవ్‌లో పడేస్తాడు.. కానీ ఎంగేజ్‌మెంట్ అయిన అమ్మాయిని లవ్‌లో పడేసే వాడికి ఒక రేంజ్ ఉంటంది’’ అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus