Pushpa Movie: పుష్ప క్లైమాక్స్ ను అలా ప్లాన్ చేశారా..?

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో మొదటి భాగానికి ది రైజర్ అనే ట్యాగ్ లైన్ ను సుకుమార్ ఫిక్స్ చేశారని పుష్ప – ది రైజర్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు సుకుమార్ ఈ సినిమా క్లైమాక్స్ ను చైనాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప పార్ట్ వన్ ను దసరా రేసులో నిలపాలని భావిస్తుండగా ఆర్ఆర్ఆర్, ఆచార్య రిలీజ్ డేట్ లను బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సొంతం చేసుకోవాలని బన్నీ భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి కాగా బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కగా ఆర్య బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటే ఆర్య2 కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. అయితే ఆర్య, ఆర్య2 సినిమాల్లో క్లాస్ గా కనిపించిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మాత్రం ఊరమాస్ గా కనిపిస్తుండటం గమనార్హం. బన్నీకి జోడీగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus