దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ ఒక్క సినిమా కోసమే ఏకంగా మూడు సంవత్సరాలు కేటాయించడం గమనార్హం. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను పెంచగా త్వరలో మరో సర్ప్రైజ్ ఇస్తామని ఆర్ఆర్ఆర్ మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ పై అంతకంతకూ అంచనాలను పెంచుతున్న రాజమౌళి ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి కథను చెప్పబోతున్నారో తెలియాల్సి ఉంది.
ఈ సినిమా కథకు సంబంధించి ఏ విషయం లీక్ కాకుండా రాజమౌళి జాగ్రత్త పడ్డారు. అయితే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది. ఈ సినిమాను రాజమౌళి సీరియస్ గా నడిపిస్తారని ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఆర్ఆర్ఆర్ నచ్చదని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు బాహుబలి సినిమాతో పోలికలు వస్తున్నాయి. జోనర్ వేరు అయినప్పటికీ బాహుబలి సినిమాను మించి ఆర్ఆర్ఆర్ ఉంటుందా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బాహుబలి 2ను మించిన కలెక్షన్లు సాధిస్తారేమో చూడాల్సి ఉంది. అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటామని ఈ సినిమా హీరోలు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, తారక్ నటించే ప్రాజెక్ట్ లు సైతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు కావడం గమనార్హం. తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించనుండగా చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటించనున్నారు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్