ఇంట్రక్షన్ సీన్… సినిమాలో దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే కొన్ని వందల సినిమాల రిఫరెన్స్‌లు చెప్పొచ్చు. కొంతమంది దర్శకులు చాలా సింపుల్‌గా ఆ సీన్ తీసేస్తే, ఇంకొందరు భారీ హంగామాతో తెరకెక్కిస్తారు. అయితే దేని లెక్క దానిదే, ఎవరి లెక్క వారిదే. ఒక్క హీరోనే చూపించి ఇంట్రక్షన్ సీన్ చేసేవాళ్లూ ఉన్నారు. వేలమందిని పెట్టి ఇంట్రడక్షన్ సీన్ తెరకెక్కించేవాళ్లూ ఉన్నారు. ఇప్పుడు రెండో రకం ఆలోచనతో సుజీత్ ఓ సీన్‌ను రాసుకున్నారు. ‘ఓజీ’ సినిమా కోసం దానిని పవన్‌కు వినిపించి ఓకే చేసుకున్నారట.
‘వారాహి’ యాత్ర మూడో విడత ముగియడంతో పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు ఛాన్స్‌లు ఇచ్చాడు. దీంతో అర్జెంట్‌గా ఓ షెడ్యూల్ పెట్టేయాలని సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య అనుకుంటున్నారు. సెప్టెంబరు 5 నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త షెడ్యూల్ ఉంది. అదైన వెంటనే ‘ఓజీ’ షెడ్యూల్ మొదలవుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ గురించి రెండు ఆసక్తికర విషయాలు బయకు వచ్చాయి. ఒకటి షెడ్యూల్ ప్లేస్ అయితే, రెండోది సీన్ గురించి.
నిజానికి ‘ఓజీ’లో (OG Movie) ఇంట్రడక్షన్ కోసం సుజిత్ రెండు వెర్షన్లు రాసుకున్నారట. 15 నిమిషాల నిడివి ఉన్న యాక్షన్ సీన్ ఒకటి అయితే, రెండోది నార్మల్ సీన్ అట. అయితే ఫుల్ వయలెంట్‌గా, మాసీగా, హీరోయిక్‌గా ఉన్న తొలి వెర్షన్‌కే పవన్ ఓకేశాడట. ఇందులో పవన్ ఫేస్ తొలి 14 నిమిషాలు కనిపించదట. కేవలం ఫైట్ మాత్రమే ఉంటుందట. ఆఖరి నిమిషంలో ఫేస్ రివీల్ చేస్తారట. గతంలో చిరంజీవి ‘పులి’ సినిమాలో ఇలానే చేసినట్లు గుర్తు.
ఇక ఈ సినిమా కోసం పవన్ అక్టోబరు కాల్‌షీట్లు ఇచ్చారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు అంటున్నారు. అక్కడే ఇంట్రడక్షన్ సీన్ కూడా ఉండొచ్చు అని సమాచారం. ఇప్పటికే షూటింగ్ స్పాట్ల కోసం డైరక్షన్ టీమ్ రెక్కీ ప్రారంభించిందట. ఇక ఈ సినిమాను సంక్రాంతికి తెస్తారు అని తొలుత టాక్ వచ్చినా, ఆ తర్వాత దానిని సమ్మర్ అన్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్