Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Yuvaraju Movie: మహేష్‌బాబు ‘యువరాజు’ కి 22 ఏళ్ళు!

Yuvaraju Movie: మహేష్‌బాబు ‘యువరాజు’ కి 22 ఏళ్ళు!

  • April 14, 2020 / 09:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yuvaraju Movie: మహేష్‌బాబు ‘యువరాజు’ కి 22 ఏళ్ళు!

నా కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వంలో, శ్రీ ‘బూరుగపల్లి శివరామకృష్ణ’గారు నిర్మాతగా, ‘శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై, ‘సూపర్‌స్టార్’ శ్రీ ‘ఘట్టమనేని మహేష్‌బాబు’ కథానాయకుడిగా, అందాల తారలు ‘సిమ్రాన్’ మరియు ‘సాక్షి శివానంద్’గార్లను కథానాయికలుగా, నా ‘గురువు’గారైన కీ॥శే॥ శ్రీ ‘వేటూరి సుందరరామమూర్తి’గారి గేయ రచనలతో, శ్రీ ‘రమణ గోగుల’గారి సంగీత సారథ్యంలో, శ్రీ ‘చింతపల్లి రమణ’, ‘రాజేంద్ర కుమార్’గార్ల మాటలతో.. 14 ఏప్రిల్ 2000 నాడు విడుదలైన ‘యువరాజు’ తెలుగు చలనచిత్రానికి నిన్నటికి సరిగ్గా 21 ఏళ్లు నిండి, నేటితో 22 సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

An interesting Shocking story behind Mahesh Babu's Yuvaraju movie1

నేను కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం వహించిన చిత్రాలలో ‘యువరాజు’ చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే.. కథానాయకుడుగా తన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ షూటింగ్ దశలో ఉండగానే నేను చెప్పిన 20 నిమిషాల నిడివి గల ఓ ముక్కోణపు ప్రేమ మరియు బిడ్డ భావోద్వేగాలు, మనోభావాలతో ముడిపడ్డ సున్నితమైన మూలకథని విని, ‘మహేష్‌బాబు’ ఎంతో సాహసంతో తన 2వ చిత్రంగా ‘యువరాజు’ చిత్రాన్ని ఓకే చెయ్యడమే. అటువంటి వైవిధ్యమైన భావోద్వేగాలు ఉన్న కథని, చిన్న వయసులోనే అర్థం చేసుకున్న ‘మహేష్‌బాబు’ మానసిక పరిపక్వత, పరిణితిలను చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగి, తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఈ కథని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులకు నచ్చే విధంగా తియ్యాలి అన్న ఒక దృఢ సంకల్పంతో కూడిన సవాలుగా స్వీకరించాను.

An interesting Shocking story behind Mahesh Babu's Yuvaraju movie2

నిజంగా చెప్పాలంటే.. నా 2వ చిత్రం ‘సీతారామరాజు’ రీ రికార్డింగ్ దశలో ఉండగానే ప్రముఖ నిర్మాత శ్రీ ‘అశ్వనీదత్’గారు చూసి, ‘సూపర్‌స్టార్’ ‘కృష్ణ’గారితో నా దర్శకత్వ ప్రతిభ గురించి మంచిగా చెప్పటం జరిగింది. అదే సమయానికి ‘కృష్ణ’గారు ‘పద్మాలయా స్టూడియోస్’ బ్యానర్‌పై.. తను మరియు ‘మహేష్‌బాబు’లపై ‘రాజకుమారుడు’ తర్వాత ఓ చిత్రాన్ని నిర్మించాలి అన్న ఆలోచనలో ఉండటంతో, వారిద్దరిపై కథ చెప్పమని నన్ను పిలిపించారు. సరిగ్గా వాళ్ళిద్దరినీ దృష్టిలో ఉంచుకుని, నేను ఎప్పుడో రాసుకున్న భారీ వ్యయంతో కూడిన ఓ పీరియాడిక్ లవ్, మెలోడ్రామా, యాక్షన్ కథను చెప్పటం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ కథని చెప్పే విధానంతో ‘మహేష్‌బాబు’కి నాపై, నా ప్రతిభపై ఓ నమ్మకం ఏర్పడింది. దాంతో తన 2వ చిత్రానికి దర్శకుడిగా నన్ను ఫిక్స్ చేస్తూ వేరొక కథ చెప్పమన్నారు. ఈసారి నేను ఒక సోషల్ యాక్షన్ అండ్ లవ్ అంశాలతో కూడిన ఒక కథ మరియు ‘యువరాజు’ చిత్ర కధలను చెబుదామని వెళ్లి.. ముందుగా ‘యువరాజు’ చిత్ర మూలకథని చెప్పడం జరిగింది. తను వెంటనే 2వ కథ గురించి అడగకుండా ‘యువరాజు’ కథని ఓకే చేయడంతో, ఆయన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తూ ‘యువరాజు’ చిత్రానికి కార్యరూపం దాల్చటం జరిగింది.

An interesting Shocking story behind Mahesh Babu's Yuvaraju movie3

ఒరిజినల్‌గా ఇంత సున్నితమైన కథలోని ఇద్దరు కథానాయికల్ని, బిడ్డ పాత్రధారుడిని సరికొత్త వారిని పరిచయం చేయడం ద్వారా కథలోని పాత్రలను ప్రేక్షకులకి అతి చేరువగా తీసుకువెళ్ళవచ్చునని మేము అనుకోవటం జరిగింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ‘సిమ్రాన్’, ‘సాక్షి శివానంద్’గార్లను మరియు అంతకు కొన్ని సంవత్సరాల కిందట ‘చూడాలని ఉంది’ చిత్రంలో ‘చిరంజీవి’గారికి బిడ్డగా నటించిన ‘మాస్టర్ తేజ’ని.. పైన నేను చెప్పిన పాత్రధారులుగా తీసుకోవడం జరిగింది. కథానాయకుడు కాకముందు ‘చైల్డ్-ఆర్టిస్ట్‌’గానే ‘మహేష్‌బాబు’ యాక్ట్ చేసిన సినిమాలు బాక్స్-ఆఫీసు దగ్గర అప్పటి అగ్ర కథానాయకుల చిత్రాల కలెక్షన్లకి తీసిపోకుండా వసూలు చేయడం గమనార్హం.

ఇంతలో తను కథానాయకుడిగా నటించిన మొట్ట మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత పెరిగిన అంచనాల మేరకు మా ‘యువరాజు’ కథకు మరికొన్ని కమర్షియల్ హంగులను జత చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే.. ఈ చిత్రంలోని 8 పాటలు 3 మ్యూజిక్ బిట్స్.. మొత్తం 11 పాటలలో.. కొన్ని కమర్షియల్ తరహా, మరి కొన్ని సందర్భ శుద్ధి తరహా మిశ్రమాల మేళవింపులో ఉండటం ఓ ప్రత్యేకత. ‘మహేష్‌బాబు’కు ఉన్న అందం, సుకుమారత్వం, సౌమ్యం మరియు చిలిపితనానికి చిహ్నంగా మా చిత్రంలోని ‘గుంతలకిడి’ పాటలో తనని ‘శ్రీకృష్ణ భగవానుడు’ రూపంలో చూపించటం మరొక ప్రత్యేకత.

An interesting Shocking story behind Mahesh Babu's Yuvaraju movie4

ఇక ఈ చిత్ర విడుదల విషయానికొస్తే.. మా చిత్రానికి సరిగ్గా 9 రోజుల ముందు అంటే ఏప్రిల్ 5న ‘నాగార్జున’గారి ‘నువ్వు వస్తావని’ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది, మా చిత్రానికి సరిగ్గా 6 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20న ‘పవన్ కళ్యాణ్‌’గారి ‘బద్రి’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది మరియు మా చిత్రం విడుదల రోజే అంటే సరిగ్గా ఏప్రిల్ 14నే దిగ్దర్శకులు ‘మణిరత్నం’గారి ‘సఖి’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇటువంటి సూపర్ హిట్ చిత్రాల మధ్యలో విడుదలై కూడా ప్రేక్షకుల మన్ననలు పొందటమే కాక, విజయవంతమై 77కి పైగా కేంద్రాలలో అర్ధ శతదినోత్సవం మరియూ 19కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నదంటే దానికి కారణం ‘మహేష్‌బాబు’కి ఉన్న అచంచలమైన ఇమేజ్ మరియు ఈ కథలో ఇమిడి ఉన్న మెలోడ్రామా యొక్క బలమే అని నా ప్రగాఢ నమ్మకం.

An interesting Shocking story behind Mahesh Babu's Yuvaraju movie5

అందుకే నా చిత్రాలలో ‘యువరాజు’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంటుంది. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛని, గౌరవాన్ని ఇవ్వడంలో మనకున్న అతి కొద్ది మంది కథానాయకులలో ‘మహేష్‌బాబు’ ముఖ్యులు. ‘యువరాజు’ చిత్రం సందర్భంగా తనతో కలిసి పనిచేసిన కాలం నేను ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ నాకు మరపునకురాని, ఓ మధురమైన జ్ఞాపకం లాంటిది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కష్టపడి పనిచేసిన నాతోటి సాంకేతిక నిపుణులందరికీ మరియు నటీనటులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ..

An interesting Shocking story behind Mahesh Babu's Yuvaraju movie6

మీ
వైవిఎస్ చౌదరి
14.04.2021.

పదిలం: అన్న ‘ఎన్‌. టి. ఆర్‌.’ అభిమానినైన నాతో.. నేను పనిజేసిన అందరి హీరోల అభిమానులు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. వారితో నేనూ అంతే ఆత్మీయంగా ఉండేవాడిని. నా మొదటి 2 చిత్రాలకు నటసామ్రాట్‌ ‘ఎ. ఎన్‌. ఆర్‌.’గారు & యువసామ్రాట్‌ ‘నాగార్జున’గార్ల అభిమానులే శతదినోత్సవ వేడుక జరిపి 100 రోజుల జ్ఞాపికలు ఇచ్చారు. అలాగే ‘యువరాజు’ చిత్రానికి కూడా సూపర్‌స్టార్‌ ‘కృష్ణ’గారు & సూపర్‌స్టార్‌ ‘మహేష్‌బాబు’గార్ల అభిమానులే శతదినోత్సవ వేడుక జరిపి 100 రోజుల జ్ఞాపికలు ఇచ్చారు. ఆ జ్ఞాపికలు, జ్ఞాపకాలు ఇప్పటికీ నా దగ్గర, నాలో పదిలంగానే ఉన్నాయి.

An interesting Shocking story behind Mahesh Babu's Yuvaraju movie7

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Burugapally Sivarama Krishna
  • #Mahesh Babu
  • #Ramana Gogula
  • #Sakshi Shivanand
  • #Simran

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 hour ago
Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

1 hour ago
K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

2 hours ago
Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

7 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

8 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

8 hours ago
Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

9 hours ago
బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

10 hours ago
Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

10 hours ago
మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version