మన తెలుగోళ్ళకి పెద్ద పండగ సంక్రాంతి. ఊర్లు, విదేశాల నుండి కూడా ఈ పెద్ద పండక్కి అందరూ తమ ఇళ్లకు చేరుకొని సరదాగా కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటారు. ఈ పండగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చూడడం కూడా ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీని వ్యాపారంగా మార్చుకొని గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ విరాజిల్లుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఈ పండగ విడుదలకు పోటీ పడడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం.
సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోలు, డిజాస్టర్ అందుకున్న హీరోలు ఉన్నారు. అయితే.. యావరేజ్ సినిమాలను కూడా హిట్ గా నిలబెట్టగలిగే దమ్మున్న సీజన్ ఈ సంక్రాంతి. 2024 సంక్రాంతికి కూడా ఎప్పట్లానే ముగ్గురు స్టార్ హీరోలు తలపడుతున్నారు. వెంకటేష్ “సైంధవ్”, నాగార్జున “నా సామి రంగ”, మహేష్ బాబు “గుంటూరు కారం”తోపాటుగా చైల్డ్ ఆర్టిస్ట్ టర్నడ్ హీరో తేజ సజ్జా నటించిన “హనుమాన్” ఈ మూడు రోజుల్లో విడుదల కానున్నాయి.
రేపటి నుండి మొదలవ్వనున్న ఈ పోటీలో పైచేయి కోసం (Hanu Man)”హనుమాన్” టీం ఆల్రెడీ ఇవాళ సాయంత్రం (జనవరి 11) నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. రేపు ఉదయం ఈపాటికి “గుంటూరు టాకీస్”, ఆ మర్నాడు ఉదయం “సైంధవ్”, ఆదివారం “నా సామి రంగ”లు విడుదలకు క్యూ కట్టాయి. అన్నీ సినిమాలకు దాదాపుగా మంచి బజ్ ఉంది.
థియేటర్ల విషయంలో కాస్త గోల జరుగుతున్నప్పటికీ.. అవన్నీ మొదటి మూడు రోజులే ఆ తర్వాత ఏ సినిమా బాగుంటే దానికి థియేటర్లు పెరుగుతాయి. మరి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాలంటే ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!