ఫోటో మిస్టరీ: ‘ఆదిత్య 369’ రోజుల్లో…!

సింగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా ఈ చిత్రాన్ని ఎంతో కలర్ ఫుల్ గా… ఓ విజువల్ వండర్ గా తీర్చి దిద్దారు మన సింగీతం. అప్పట్లో నందమూరి బాలకృష్ణ … స్క్రిప్ట్ చాలా రిస్క్ తో కూడుకున్నది అని తెలిసినా… ఏమాత్రం లెక్క చేయకుండా ఈ చిత్రంలో హీరోగా నటించడానికి ముందుకు వచ్చారట. మరీ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో అయితే కాదు కానీ… కమర్షియల్ సక్సెస్ అందుకున్న చిత్రంగా నిలిచింది.

అంతేకాదు క్లాసిక్, విజువల్ వండర్ అని ప్రశంసలు కూడా దక్కించుకుంది. 1991 జూలై 18న విడుదలైన ఈ చిత్రం అప్పటి రోజుల్లోనే 1.6 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొంది 5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక టైం మిషన్ లో రాయల కాలానికి వెళ్ళిన బాలకృష్ణ, హీరోయిన్ మోహిని, సుత్తివేలు.. ఓ కోటలో రాయల ఆస్థానంలో చేరతారు. అక్కడ సిల్క్ స్మిత మరియు హీరోయిన్ మోహిని లకు మధ్య డ్యాన్స్ కాంపిటిషన్ జరుగుతుంది.

‘సుర మోధము సుఖ నాట్య వేదము’ అని వేటూరి గారు రాసిన పాటకి మధ్యలో ‘రాక్ అండ్ రోల్’ అంటూ బాలయ్య కూడా చిందులు వేస్తాడు. దానికి సంబంధించిన ఫోటోని మనం చూడవచ్చు.కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ఈ ఫోటోలో ఉండడం మనం గమనించవచ్చు. ఇక ‘ఆదిత్య 369’ లో హీరో తరుణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మరో విశేషం.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus