ఓ కథ ఒక భాషలో సూపర్ హిట్ అయ్యింది అంటే దాన్ని వేరే భాషలోకి రీమేక్ చేయడం కామన్. కానీ మాతృకలా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం. అది పూర్తిగా దర్శకుడు ఆ కథని ఓన్ చేసుకుని.. నేటివిటీకి తగ్గట్టు మార్పులు వంటివి చేసి రీమేక్ చేయాలి. అప్పుడే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఫలితం తేడా కొడుతుంది. అంతేకాదు రీమేక్ కోసం సరైన నటీనటులను ఎంపిక చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ.
ఒరిజినల్ కథ…ఏ హీరోకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనేది కూడా అంచనా వేసుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు.. ముందుగా దర్శకుడు బాగా ఓన్ చేసుకోగలగాలి. ఇవి లోపించడం వల్లే కొన్ని మంచి కథలు తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. అందులో ‘భలే దొంగలు’ (Bhale Dongalu) అనే సినిమా కూడా ఒకటి. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బంటీ ఔర్ బబ్లీ’ కి రీమేక్ గా తెరకెక్కింది ఈ ‘భలే దొంగలు’.
అప్పటికి మంచి ఫామ్లో ఉన్న ఇలియానా (Ileana D’Cruz) ఇందులో హీరోయిన్. రీమేక్ సినిమాలు బాగా తీస్తాడు అనే పేరున్న కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) దీనికి దర్శకుడు. బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) దీనికి ఓ నిర్మాత. ఓ మినిమమ్ గ్యారంటీ ప్రోడక్ట్ రావడానికి ఈ మాత్రం ఫాక్టర్స్ సరిపోతాయి కదా. పైగా సినిమా సమ్మర్లో రిలీజ్. ఇన్ని అడ్వాంటేజ్..లు ఉన్నా, ఈ సినిమా నిలబడలేదు. అందుకు కారణం.. ఈ సినిమా వచ్చే టైంకి తరుణ్ (Tarun Kumar) ఆల్మోస్ట్ ఫేడౌట్ అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) రేంజ్లో జగపతి బాబు ఫిట్ అవ్వలేదు.
ఇవన్నీ ఎలా ఉన్నా దర్శకుడు విజయ్ భాస్కర్… సెకండాఫ్ ని సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. త్రివిక్రమ్ (Trivikram) లేకుండా విజయ్ భాస్కర్ సరైన వంటకం వండలేడు అని కూడా అందరికీ తెలిసొచ్చినట్టు అయ్యింది. మరోపక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘జల్సా’ (Jalsa) పోటీగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాని పట్టించుకోలేదు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ‘భలే దొంగలు’ (Bhale Dongalu) రూపంలో ఓ మంచి కథ వేస్ట్ అయిపోయినట్టు అయ్యింది. 2008 ఏప్రిల్ 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా వచ్చి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది.