అవి ‘ఆరెంజ్’ (Orange) సినిమా విడుదలైన తొలి రోజులు. ఆ సినిమా అందుకున్న టాక్ కాస్త తేడాగా ఉన్నా.. కథలోని వైబ్‌తో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆయన కూడా తన తర్వాతి సినిమా కూడా కొత్త హీరో, కాస్త పేరున్న హీరోలతో కాకుండా ఓ స్టార్ హీరోతోనే చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ఓ కథ చెప్పారని వార్తలొచ్చాయి. అవును, అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనుకుంటున్నారా. ఉందీ విషయం ఉంది. ఎందుకంటే ఆ కథను మళ్లీ బయటకు తీస్తున్నారు కాబట్టి.
పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీ అయిపోయారు కాబట్టి వచ్చిన ప్రతి సినిమా చేయడం లేదు అనుకోవచ్చు. అయితే ఆయన స్టార్ హీరోగా ఉన్నప్పుడు కూడా వచ్చిన సినిమాలన్నీ చేయలేదు. బాగున్నాయి అనుకున్న సినిమాలు కూడా చేయలేదు ఆయన. అలా ఆయన కథ విని, కామ్‌గా ఉండిపోయిన దర్శకుల్లో బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఒకరు. ‘ఆరెంజ్’ సినిమా తర్వాత పవన్‌కు భాస్కర్ ఓ కథ చెప్పారు.
నా కెరీర్ బెస్ట్ ఫిలిం ఇంకా నేను తీయలేదు. ఆ సినిమా చేయాలనే ఆశ ఉంది. కథ రెడీగా ఉంది. చాలా ఏళ్ల క్రితం పవన్ కల్యాణ్‌కు ఆ కథ చెప్పాను. ఇలా కూడా కథ రాస్తారా అని ఆయన చిన్నగా షాక్ అయ్యారు. డిఫరెంట్‌గా ఉంది, బాగుంది అని కూడా చెప్పారు. కానీ ఆ రోజుల్లో కథ పూర్తి చేయాలంటే ఇంకా చాలా లైఫ్ చూడాలి అనిపించింది. అందుకే పక్కనపెట్టాను. ఇప్పుడు ఈ కథ బయటకు తీశాను అని చెప్పారు బొమ్మరిల్లు భాస్కర్?
మరి పవన్ అంతా ఆశ్చర్యపోయిన ఆ కథ.. ఏంటో.. అందులో ఇప్పుడు ఎవరు నటిస్తారో చూడాలి. ‘ఆరెంజ్’ కథ మనం చూశాక ఆ సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ అంతకుమించిన టిపికల్ రాసుకొని ఉంటారు అని చెప్పాలి. మరి ఇప్పుడు ‘జాక్’ (Jack) ఫలితం తేడా కొట్టిన నేపథ్యంలో భాస్కర్ ఆ కథ బయటకు తీస్తారా?