Chiranjeevi: చిరంజీవి కొత్త సినిమా అఫీషియల్‌.. బ్లడీ మాస్‌ లుక్‌తో..!

శ్రీకాంత్‌ ఓదెలతో (Srikanth Odela) చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా ఉంటుంది అని ఈ మధ్యే మన ఫిల్మీ ఫోకస్‌లో చదివే ఉంటారు. దాదాపు పక్కా అని తెలిసిన ఆ ప్రాజెక్ట్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌కి చాలా టైమ్‌ పట్టొచ్చు అని వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా నాని నిన్న రాత్రి అనౌన్స్‌ చేసేశాడు. ప్రాజెక్టు అఫీషియల్‌ అవ్వడంలో కొత్త విషయం లేకపోవచ్చు కానీ ఆ సినిమా నిర్మాణంలో నాని కూడా నిర్మాణ భాగస్వామి కావడం ఇక్కడ విషయం.

Chiranjeevi

అవును, నాని (Nani) కొత్త నిర్మాణ సంస్థ యు‘నాని’మస్‌ను స్థాపించాడు. అందులో తొలి సినిమాగా చిరంజీవి – ఓదెల సినిమాను అనౌన్స్‌ చేశాడు. సెన్సిటివ్‌ కంటెంట్‌ అంటూ తొలుత ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)ను ఊరించిన నాని రాత్రి 8 తర్వాత సినిమాను అఫీషియల్‌ చేశాడు. రక్తం నిండి ఉన్న చేతి ఫొటోను, బ్యాగ్రౌండ్‌లో రెడ్‌ వేసి ఆ వయెలెంట్‌ సినిమాను అనౌన్స్‌ చేశాడు. దీంతో ఫ్యాన్స్‌ షాక్‌లోకి వెళ్లారు. ఎందుకంటే చిరంజీవిని చూసి, స్ఫూర్తి పొంది, ఆయన దారిలోనే స్వయంకృషితో హీరోగా మారిన వాడు నాని.

ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు అతనే చిరంజీవి సినిమాను సమర్పిస్తున్నాడు అంటే విషయమే కదా. సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత కాగా. నాని ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ చేసి ప్రెజెంటర్‌ అయ్యాడు అని అంటున్నారు. ‘‘అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు’’ అంటూ ఆ పోస్టర్‌పై ఓ ఆసక్తికర వ్యాఖ్య రాసుకొచ్చారు. ‘‘చిరంజీవి స్ఫూర్తితో పెరిగాను. ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చున్నాను.

ఇప్పుడాయన చిత్రాన్ని సమర్పిస్తున్నాను. జీవితం పరిపూర్ణమైంది’’ అని రాసుకొచ్చాడు నాని. వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని ‘ది ప్యారడైజ్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చిరు సినిమా ఉంటుంది. ఒక్క మాటైతే నిజం.. చిరంజీవి నుండి ఇలాంటి వయెలెంట్‌ సినిమా ఇప్పటివరకు రాలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus