‘గోవిందా గోవిందా’ చిత్రం వెనుక అంత కథ ఉందా?

  • May 24, 2020 / 09:00 AM IST

‘శివ’ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడమే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రాంగోపాల్ వర్మ.. అదే మన ఆర్జీవి. ఆ చిత్రాన్ని హిందీలో కూడా తీసి హిట్ కొట్టాడు. అంతే బాలీవుడ్ లో అతనికి మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగులో కూడా వర్మతో సినిమాలు చెయ్యాలని ఎంతో మంది నిర్మాతలు అతని కాల్షీట్స్ కోసం ఎగబడ్డారు. ఆ లిస్టులో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు కూడా ఉన్నారు. నాగార్జున కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. ‘గోవిందా గోవిందా’ అనే చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. తిరుమల తిరుపతి లో ఉన్న వెంకటేశ్వర స్వామి కిరీటం కొంతమంది దుండగులు కొట్టేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా లైన్.

అప్పట్లో ఈ చిత్రం ఎన్నో వివాదాలకు తెర లేపింది. వాటికి సంబంధించి జగపతి బాబు వాయిస్ ఓవర్ తో ఇటీవల ‘వింటేజ్ వైజయంతి’ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ద్వారా జగపతి బాబు మాట్లాడుతూ.. ” ‘వైజయంతీ మూవీస్’ ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉంది.కష్టం ఉంది. ఛాలెంజ్ కూడా ఉంది. అలా చేసిన చిత్రమే ‘గోవిందా గోవిందా’. దత్తుగారి ఇష్టదైవం శ్రీవేంకటేశ్వర స్వామి మీద తెరకెక్కించిన చిత్రం. అలరించే పాటలు, అద్భుతమైన చిత్ర నిర్మాణం.. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తో మొదటి ఇబ్బంది ఎదురైంది. దాదాపు 50 శాతం సినిమాని కట్ చెయ్యాలని వాళ్ళు నిర్ణయించారు.

మొత్తానికి దత్ గారు వారితో వాదించి, గొడవపడి చివరికి అనుకున్న విధంగా 1993లో చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ చిత్రానికి దేవుడి దీవెన మాత్రం దొరకలేదు. సినిమా బాగా ఆడలేదు. ఈ సినిమా ఫ్లాప్ వల్ల వైజయంతీ మూవీస్ ఆర్థికంగా పది అడుగులు వెనక్కి వెళ్ళింది.అయితే ఈ సినిమాని ఇప్పుడు టీవీలలో చూసిన వారు మాత్రం అద్బుతం అంటున్నారు. అలా ఒక చోట దేవుడు మనకి దూరం చేసిన దాన్ని మరొక రూపంలో పదిరెట్లు ఎక్కువ ప్రసాదిస్తాడు. అలాంటి సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి… దత్తుగారితో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘శుభలగ్నం’ చిత్రం తెరకెక్కింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది” అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus