మొదటి సినిమా ‘చెవిలో పువ్వు’ సినిమా ప్లాప్ అవడంతో దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారు చాలా కుమిలిపోయారు. చెప్పాలంటే ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్టు ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే రామానాయుడు గారు ఈయన్ని నమ్మి ‘ప్రేమ ఖైదీ’ అవకాశాన్ని ఇవ్వడం తో హిట్టు కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు ఇవివి. ఆయన రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలని.. చాలా సార్లు అనుకునేవారట. రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ గారితో.. ఆయన సొంత బ్యానర్లో ఓ సినిమా చేసి హిట్టు కొట్టాలని ఆయన ఆశపడ్డారు.
వెంకటేష్ గారితో సినిమా చేసే అవకాశం అయితే ఇవివి గారికి దక్కింది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్లు కూడా అయ్యాయి. కానీ అవి రామానాయుడు గారి బ్యానర్లో చేసినవి కావు. అయితే వెంకీతో ఇవివి గారు చేసిన ‘అబ్బాయిగారు’ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ అనే సినిమాలు రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈరోజు ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా విడుదలయ్యి 25 ఏళ్ళు కావస్తోంది. 1996 వ సంవత్సరం మే 22న ఈ చిత్రం విడుదలయ్యింది.ఇద్దరి పెళ్ళాల మధ్య నలిగిపోయిన మొగుడి పాత్రలో వెంకీ పండించిన కామెడీకి ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.
‘తాయ్ కులమే తాయ్ కులమే’ అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. అయితే తెలుగులో మొదట ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు చాలా మంది హీరోలను సంప్రదించారట దర్శకులు ఇవివి. కానీ ఆ హీరోల్లో కొందరు తమ ఇమేజ్ కు సూట్ అవ్వదని మరికొంతమంది అయితే టైటిల్ మారిస్తే చేస్తాము అని చెప్పారట. అందుకు దర్శకుడు నొ చెప్పడంతో.. వాళ్ళు ఈ రీమేక్ ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఫైనల్ గా వెంకటేష్ ఎటువంటి నామోషీ ఫీలింగ్ పెట్టుకోకుండా ఈ సినిమా చెయ్యడం.. అది సూపర్ హిట్ అవ్వడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ ను చూసిన తర్వాత.. ఈ రీమేక్ ను రిజెక్ట్ చేసిన చాలా బాధపడినట్లు కూడా తెలుస్తుంది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!