కొండారెడ్డి బురుజు సెంటర్లో ఓబుల్ రెడ్డిని కొట్టిన ఒకే ‘ఒక్కడు’

రాజకుమారుడు సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్, మురారి చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. ఐతే మహేష్ ని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసిన చిత్రం మాత్రం ఒక్కడు. మురారి సినిమా తరువాత మహేష్ చేసిన టక్కరి దొంగ యావరేజ్ టాక్ తెచ్చుకోగా, బాబీ ప్లాప్ గా నిలిచింది. దీనితో మహేష్ కి ఓ భారీ హిట్ పడాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో దర్శకుడు గుణశేఖర్ మహేష్ తో యాక్షన్ ఎంటర్టైనర్ ఒక్కడు చేశారు.

ఓ అమ్మాయిని కాపాడడం కోసం రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ తో పెట్టుకొనే, కబడ్డీ ప్లేయర్ గా మహేష్ ఈ మూవీలో నటించారు. ఫన్ అండ్ ఎమోషన్స్ తో పాటు మాస్ కి కావలసిన ఫైట్స్ తో గుణశేఖర్ మూవీని అద్బుతంగా తెరకెక్కించారు. కాగా ఈ మూవీలో ఓ ఐకానిక్ సీన్ ఉంటుంది. తన నుండి పారిపోతున్న భూమికను విలన్ ప్రకాష్ రాజ్ కొండారెడ్డి బురుజు సెంటర్ లో లాక్కొని వెళుతూ ఉంటాడు.

అసలు అక్కడున్నది ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యాక్షనిస్టో తెలియని మహేష్, అతనిపై చేయి చేసుకుంటాడు. అది చూసి అక్కడి జనం కొండారెడ్డి బురుజు సెంటర్ లో ఓబుల్ రెడ్డి పై చేసుకున్నాడు, ఎవడ్రా ఇతను అని ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. ఒక్కడు మూవీలోని అనేక అద్భుత సన్నివేశాల్లో ఇది చాలా ప్రత్యేకం. ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం కూడా హైలెట్ అని చెప్పాలి.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus