టైగర్ ష్రాఫ్ ని బన్నీ అలా వాడుకుంటున్నాడా?

మన గురించి మనం కాకపోతే ఎవరు చెవుతారు చెప్పండి. ఎదుటివారు సొంత డబ్బా అనుకుంటారని మనం మన గొప్పలు చెప్పకపోతే, అవి ఎవరికీ తెలియకుండానే కనుమరుగైపోవచ్చు. మనలాంటోళ్ళకే పబ్లిసిటీ, మార్కెట్ పై ఇంత పిచ్చి ఉంటే, అదే ఆధారంగా చేసుకొని, కెరీర్ నిర్మించుకోవాల్సిన సెలెబ్రిటీలకు ఎంత ఉంటుంది చెప్పండి. ఇటీవల బన్నీ పేరు బాలీవుడ్ లో కొందరినోట వినిపించింది. ఓ దర్శకుడు మరి కొందరు నటుల నోట హీరో అల్లు అర్జున్ పేరు వినిపించింది.

అల వైకుంఠపురంలో మూవీ అధ్బుతం అని, అసలు బన్నీ నటన విషయంలో చంపేశారని ఆకాశానికి ఎత్తారు. చివరకు హృతిక్ నోట వెంట కూడా బన్నీ పేరు రావడంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఐతే ఇవన్నీ బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కోసం వేస్తున్న మార్గాలని కొందరు ఆరోపిస్తున్నారు. బన్నీ పొగడ్తల వెనుక బాలీవుడ్ యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఉండొచ్చు అనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో బన్నీ కొడుకు నాకు టైగర్ ష్రాఫ్ అంటే ఇష్టం అని చెప్పగా, టైగర్ బన్నీ కొడుకుని తన షూటింగ్ సెట్స్ కి ఆహ్వానించారు.

టైగర్ ష్రాఫ్ అప్పుడెప్పుడో బన్నీ నటించిన పరుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మూవీ హిందీ రీమేక్ హీరోపంతి లో ఆయన నటిచడం జరిగింది. ఈ మూవీకి సీక్వెల్ గా హీరోపంతి 2 తెరకెక్కనుంది. ఈ మూవీలో గెస్ట్ రోల్ చేయడానికి బన్నీ ఒప్పుకున్నాడట. ఎలాగైనా సౌత్ లో పాగా వేయాలనుకుంటున్న టైగర్, బన్నీ హెల్ప్ ఆ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు. అదే సమయంలో బన్నీని బాలీవుడ్ లో ప్రోమోట్ చేయాల్సిన బాధ్యత టైగర్ ది. దానిలో భాగంగానే ఈ మధ్య బాలీవుడ్ సెలెబ్రిటీల నోట బన్నీ మాట వచ్చిందని టాలీవుడ్ టాక్.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus