నాని – వివేక్ ఆత్రేయ ల సినిమా టైటిల్ ఫిక్స్..!

  • November 14, 2020 / 04:58 PM IST

‘గ్యాంగ్ లీడర్’ ‘వి’ వంటి వరుస ప్లాప్ లతో నాని కాస్త డీలా పడ్డాడు. దాంతో తాను చెయ్యబోయే తరువాతి సినిమాల పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘నిన్నుకోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ డైరెక్షన్లో ‘టక్ జగదీష్’ అనే చిత్రం చేస్తున్న నాని… ఇది పూర్తయిన వెంటనే ‘టాక్సీ వాలా’ ఫేమ్ రాహుల్ సంక్రిత్యన్ తో ‘శ్యామ్ సింగరాయ్’ అనే పునర్జన్మల కాన్సెప్ట్ సినిమా చెయ్యబోతున్నాడు.వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం..

నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే తన 28వ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో చెయ్యబోతున్నట్టు కూడా నాని అనౌన్స్ చేసాడు. ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ వంటి సూపర్ హిట్లను అందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ.. ‘నాని 28’ ను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజిమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇక ఈ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి.. ‘అంటే సుందరానికి..’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంలో ‘మైండ్ డైవర్షన్’ డిజార్డర్ తో బాధపడే వ్యక్తిగా కనిపించిన నాని.. ఈ చిత్రంలో ప్రతీ విషయానికి కంగారు పడే వ్యక్తిగా కనిపించబోతున్నాడని టాక్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus